60యేళ్ల మహిళపై 19యేళ్ల యువకుడు అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో చంపి, శవంతో దారుణం...

Published : Sep 17, 2021, 09:25 AM IST
60యేళ్ల మహిళపై 19యేళ్ల యువకుడు అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో చంపి, శవంతో దారుణం...

సారాంశం

హనుమాన్ ఘడ్ జిల్లా పిలిబంగా పట్టణానికి చెందిన 19యేళ్ల యువకుడు మద్యం మత్తులో అమానుషానికి తెగబడ్డాడు. పీకలదాకా తాగి మద్యం మత్తులో పక్కింట్లో ఒంటరిగా ఉన్న 60యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశాడు. 

జైపూర్ : వావివరసలు మరిచి, చిన్నా,పెద్దా వయసు తేడాలు లేకుండా ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వృద్ధులను కూడా వదలకుండా మహిళలు అంటే చాలు.. అత్యాచారాలకు దిగజారుతున్నారు కీచకులు. 

అలాంటి మరో దారుణమైన అమానుష ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది. హనుమాన్ ఘడ్ జిల్లా పిలిబంగా పట్టణానికి చెందిన 19యేళ్ల యువకుడు మద్యం మత్తులో అమానుషానికి తెగబడ్డాడు. పీకలదాకా తాగి మద్యం మత్తులో పక్కింట్లో ఒంటరిగా ఉన్న 60యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం చేశాడు. 

దీనికి ఆమె ప్రతిఘటించడంతో వృద్ధురాలిని చంపేశాడు. ఆ తరువాత అత్యంత పాశవికంగా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, నిందితుడైన కామాంధుడిని అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..