భార్య అక్రమ సంబంధం..నడిరోడ్డు పై భర్త..!

Published : Jul 26, 2021, 11:59 AM IST
భార్య అక్రమ సంబంధం..నడిరోడ్డు పై భర్త..!

సారాంశం

రెండు, మూడుసార్లు హెచ్చరించాడు కూడా.. అయినా వారు అతని హెచ్చరికలు ఖాతరు చేయలేదు. దీంతో.. కోపంతో ఊగిపోయిన భర్త.. నడిరోడ్డుపై ఆ మెడికల్ షాప్ యజమాని ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు.

భర్తని కాదని ఓ మహిళ.. ఓ మెడికల్ దుకాణం యజమానితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలీకుండా.. అదే మెడికల్ షాప్ లో సరసాలు ఆడేది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో.. రెండు, మూడుసార్లు హెచ్చరించాడు కూడా.. అయినా వారు అతని హెచ్చరికలు ఖాతరు చేయలేదు. దీంతో.. కోపంతో ఊగిపోయిన భర్త.. నడిరోడ్డుపై ఆ మెడికల్ షాప్ యజమాని ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో.. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌కు చెందిన అపూ కహార్‌ భార్యకు శ్రీకృష్ణాపూర్‌ ప్రాంతంలో ఉన్న మెడికల్‌ షాప్‌ యజమాని మిలాన్‌ ఘోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మెడికల్ షాపులోనే వీరిద్దరూ రాసలీలలు సాగించేవారు. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చిరించాడు. అయినా వారు సంబంధాన్ని కొనసాగించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కహార్.. మిలాన్‌ను అంతమొందించాలనుకున్నాడు. 


శుక్రవారం మధ్యాహ్నం మెడికల్ షాప్‌నకు వెళ్లి మిలాన్‌ ఘోష్‌పై దాడి చేశాడు. ప్రాణభయంతో పరిగెడుతున్న మిలాన్‌ను వెంబడించి నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే తీవ్రంగా గాయపరిచాడు. కొంత సేపటికి స్థానికులు అడ్డుకుని మిలాన్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మిలాన్ శనివారం మృతి చెందాడు. అపూ కహార్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word