వేదిక మీద వరుడిని ఓఆటాడుకున్న వధువు..!

Published : Jul 26, 2021, 11:27 AM IST
వేదిక మీద వరుడిని ఓఆటాడుకున్న వధువు..!

సారాంశం

ఆ వీడియోలో పెళ్లి మండంపై ఓ వధువు.. తాను పెళ్లిచేసుకున్న వరుడిని ఓ ఆటాడుకుంది. 

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో పెళ్లి మండంపై ఓ వధువు.. తాను పెళ్లిచేసుకున్న వరుడిని ఓ ఆటాడుకుంది. ఓ పెళ్లి వేడుకలో వరుడిని వధువు ఆట పట్టించిన తీరు చూసిన వారికి నవ్వులు పంచుతోంది. దండలు మార్చుకునే సమయంలో వరుడి చేత వధువు కబడ్డీ ఆడించింది. 

ఆ వీడియో ప్రకారం.. ఓ పెళ్లి వేడుకలో వధూవరులు దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతోంది. మొదట వరుడి మెడలో వధువు దండ వేసింది. అనంతరం వరుడు దండ వేసే సమయానికి వధువు ఆట మొదలెట్టింది. పెళ్లి వేదికపై అటూ ఇటూ పరుగెత్తుతూ వరుడికి దొరకకుండా తప్పించుకుంది. కొంతసేపు ఇద్దరూ వేదిక పైనే కబడ్డీ ఆడారు. అయితే చివరకు బంధువులు సహాయం చేయడంతో వధువు మెడలో వరుడు దండ వేయగలిగాడు. ఈ వీడియోను మనీశ్‌ మిశ్రా అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Floods Alert: ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. కేరళలో ఇప్పటివరకు 15 మంది మృతి
Paper Leak Protest: మరో పేపర్ లీక్ రచ్చ.. రాంచీలో జంతర్ మంతర్ సీన్.. రగులుతున్న ఝార్ఖండ్