చికెన్ చేయలేదని.. భార్యను చంపిన భర్త..!

Published : Aug 25, 2021, 08:00 AM ISTUpdated : Aug 25, 2021, 08:02 AM IST
చికెన్ చేయలేదని.. భార్యను  చంపిన భర్త..!

సారాంశం

తాను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి చికెన్ ఫ్రై వండి ఉంచమని చెప్పానని.. అయితే.. తన భార్య వండలేదని ఆయన పేర్కొన్నాడు. 

చికెన్ ఫ్రై వండలేదని ఓ వ్యక్తి ఆవేశంలో భార్యను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  బెంగళూరులో ముబారక్ పాషా(30), షిరిన్ బాను అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా తమ కుమార్తె కనిపించకుండా పోయిందంటూ షిరిన్ తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు షిరిన్ భర్త ముబారక్ పాషాను విచారించగా.. ఆమె హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

తానే స్వయంగా తన భార్యను చంపేశానంటూ అంగీకరించాడు. తాను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సరికి చికెన్ ఫ్రై వండి ఉంచమని చెప్పానని.. అయితే.. తన భార్య వండలేదని ఆయన పేర్కొన్నాడు. ఎందుకు వండలేదని ప్రశ్నిస్తే.. ఎదురు సమాధానం చెప్పిందని.. అందుకే ఆవేశంతో కర్రతో తలపై కొట్టి చంపేశానని అతను చెప్పాడు. ఆ సమయంలో పిల్లలు నిద్రపోతున్నారని.. శవాన్ని గోనె సంచిలో పెట్టి.. అర్థరాత్రి బైక్ మీద పెట్టుకొని సరస్సులో పడేసి వచ్చినట్లు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం