భార్య కు సైనెడ్ ఇంజక్ట్ చేసిన భర్త.. నెల తర్వాత..!

Published : Aug 09, 2021, 09:16 AM ISTUpdated : Aug 09, 2021, 09:37 AM IST
భార్య కు సైనెడ్ ఇంజక్ట్ చేసిన భర్త.. నెల తర్వాత..!

సారాంశం

 జులై 8వ తేదీన ఊర్మిళ వాసవి.. గుండె నొప్పితో..  క్రితం ఆస్పత్రిలో చేరింది. ఆమెను అతని భర్తే స్వయంగా ఆస్పత్రిలో చేర్పించాడు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను చాలా తెలివిగా చంపేశాడు. చికిత్స కోసం భార్యను ఆస్పత్రిలో చేర్పించి.. అక్కడే ఆమెను చంపేశాడు. ఆమెకు ఎక్కుతున్న సెలైన్ బాటిల్ లో సైనెడ్ ఎక్కించాడు. దీంతో.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. భార్య చనిపోయిన నెల రోజుల తర్వాత.. ఆమె భర్తను పోలీసులు అరెస్టు  చేశారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...  గుజరాత్ రాష్ట్రం అంక్లేశ్వర్ సిటీ ప్రాంతానికి చెందిన  ఊర్మిళ వాసవ(34) అనే మహిళ కు ఏడు సంవత్సరాల క్రితం జిగ్నేష్ పటేల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. జిగ్నేష్ ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. 

 కాగా.. జులై 8వ తేదీన ఊర్మిళ వాసవి.. గుండె నొప్పితో..  క్రితం ఆస్పత్రిలో చేరింది. ఆమెను అతని భర్తే స్వయంగా ఆస్పత్రిలో చేర్పించాడు. అందరి ముందు.. తనకు భార్యపై ప్రేమ ఉన్నట్లు నటించాడు.  ఆ తర్వాత ఎవరూ చూడకుండా.. భార్యకు ఎక్కిస్తున్న సెలైన్ లో కి ఇంజెక్షన్ ద్వారా సైనేడ్  ఎక్కించాడు. దీంతో.. ఆమె ఆస్పత్రిలోనే కన్నుమూసింది.

అయితే...  ఆమె చనిపోయిన తర్వాత శవపరీక్షలో ఆమె.. శరీరంలోకి సెలైన్ ఎక్కించడం వల్లే చనిపోయినట్లు తేలింది. దీంతో... ఆమె భర్తపై అనుమానం కలిగింది. సరిగ్గా.. ఆమె చనిపోయిన నెల తర్వాత.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu