ఆరేళ్ల చిన్నారి మెడకు చుట్టుకున్న విషసర్పం.. రెండు గంటలపాటు నరకం.. చివరికి కాటువేసి....

Published : Sep 16, 2021, 08:09 AM IST
ఆరేళ్ల చిన్నారి మెడకు చుట్టుకున్న విషసర్పం.. రెండు గంటలపాటు నరకం.. చివరికి కాటువేసి....

సారాంశం

పూర్వ గడ్కారీ అనే ఆరేళ్ల చిన్నారి మెడకు ఓ విషసర్పం చుట్టుకుంది. దాని పడగ ఆ చిన్నారి వీపును పూర్తిగా ఆక్రమించుకుని ఉంది. ఆ చిన్నారి భయంతో ఒక వైపు తిరిగి కదలకుండా, పడుకుని ఉంది. కదిలితే పాము రెచ్చిపోతుందని.. స్నేక్ క్యాచర్ వచ్చేవరకు కదలకుండా పడుకోమని కుటుంబసభ్యులు చెప్పడంతో ఆ చిన్నారి భయంతో రెండు గంటల పాటుఅలాగే బిగుసుకుపోయింది. 

మహారాష్ట్ర : ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో ఓ ఆరేళ్ల చిన్నారి విషసర్పం కాటు వేసినా మృత్యుముఖం నుంచి బయటపడింది. ఆ చిన్నారి మెడకు చుట్టుకున్న పాము రెండు గంటలపాటు అలాగే ఉంది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తుంది. 

బుధవారం ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. రోమాలు నిక్కబొడుకునేలా చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది. 

ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. పూర్వ గడ్కారీ అనే ఆరేళ్ల చిన్నారి మెడకు ఓ విషసర్పం చుట్టుకుంది. దాని పడగ ఆ చిన్నారి వీపును పూర్తిగా ఆక్రమించుకుని ఉంది. ఆ చిన్నారి భయంతో ఒక వైపు తిరిగి కదలకుండా, పడుకుని ఉంది. కదిలితే పాము రెచ్చిపోతుందని.. స్నేక్ క్యాచర్ వచ్చేవరకు కదలకుండా పడుకోమని కుటుంబసభ్యులు చెప్పడంతో ఆ చిన్నారి భయంతో రెండు గంటల పాటుఅలాగే బిగుసుకుపోయింది. 

15యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి....

అలా ఆ చిన్నారి గడ్కరీ రెండు గంటలపాటు అలాగే ఉంది. చివరికి పాము మెడమీదినుంచి దిగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పాప కొద్దిగా కదిలింది. దీంతో పాము ఆ చిన్నారి చేతిమీద కాటు వేసింది. వెంటనే కుటుంబసభ్యులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్చించారు.

నాలుగు రోజుల తరువాత చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాణాపాయం లేదని వైద్యులు దృవీకరించారు. 

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో