భార్యను చంపి.. ఆ విషయం పోలీసులకు చెప్పి..

Published : Jan 30, 2021, 09:14 AM IST
భార్యను చంపి.. ఆ విషయం పోలీసులకు చెప్పి..

సారాంశం

భర్త శివకుమార్ యాదవ్ తన పిల్లల ముందే వంటగదిలో నుంచి కత్తి తీసుకువచ్చి భార్య  మినీషా గొంతు కోసి చంపి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

భార్యభర్తలన్నాక.. చిన్న చిన్న గొడవలు చాలా సహజం. ఆ మాత్రానికే ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్  చేసి ఆ విషయాన్నిచెప్పడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

థానే జిల్లా డోంబివాలికి చెందిన శివకుమార్ యాదవ్ (41) భార్య మినీషాను తనతో పాటు తమ స్వగ్రామానికి రావాలని కోరాడు. భర్త స్వగ్రామానికి వచ్చేందుకు భార్య  మినీషా నిరాకరించింది. అంతే దీనిపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. భర్త శివకుమార్ యాదవ్ తన పిల్లల ముందే వంటగదిలో నుంచి కత్తి తీసుకువచ్చి భార్య  మినీషా గొంతు కోసి చంపి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. భార్యను చంపిన భర్త శివకుమార్ భార్య రక్తపు మడుగులో పడి ఉండగా అక్కడే కూర్చున్నాడు. పోలీసులు వచ్చి నిందితుడు శివకుమార్ యాదవ్ ను అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?