బ్రేకింగ్: ఢిల్లీలో పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశరాజధాని

Siva Kodati |  
Published : Jan 29, 2021, 06:08 PM ISTUpdated : Jan 29, 2021, 06:25 PM IST
బ్రేకింగ్: ఢిల్లీలో పేలుడు.. ఉలిక్కిపడ్డ దేశరాజధాని

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీ శుక్రవారం పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం 3 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలోని ఫుట్‌పాత్ వద్ద పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది.

పేలుడికి ఐఈడీ ఉపయోగించినట్లుగా పోలీసులు నిర్థారించారు. రిపబ్లిక్ డే వేడుకల ముగింపు నేపథ్యంలో బీటింగ్ రీట్రీట్ జరుగుతున్న సమయంలోనే పేలుడు సంభవించడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

బీటింగ్ రీట్రీట్‌‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?