సహజీవనం.. గర్భం దాల్చిన యువతి.. ఆ తర్వాత

Published : Aug 17, 2020, 08:27 AM ISTUpdated : Aug 17, 2020, 08:33 AM IST
సహజీవనం.. గర్భం దాల్చిన యువతి.. ఆ తర్వాత

సారాంశం

యువతి గర్భం కూడా దాల్చింది. అయితే.. వారి బంధానికి బీటలు వారాయి. చిన్న గొడవ వారి మధ్య దూరాన్ని పెంచింది. ఆ కోపంలో యువకుడు తన ప్రియురాలి గొంతు పిసికి చంపేశాడు.

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా... అని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చని సహజీవనం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో యువతి గర్భం కూడా దాల్చింది. అయితే.. వారి బంధానికి బీటలు వారాయి. చిన్న గొడవ వారి మధ్య దూరాన్ని పెంచింది. ఆ కోపంలో యువకుడు తన ప్రియురాలి గొంతు పిసికి చంపేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పూణేకి చెందిన రంజన్‌వావ్‌లో కిరన్ ఫండే అనే వ్యక్తి 24 ఏళ్ల యువతితో కలిసి సహజీవనం చేస్తున్నాడు. ఆమె ఇటీవలే గర్భందాల్చింది. అయితే.. పెళ్లికి ముందే గర్భం రావడంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ క్రమంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది. కోపంలో తన ప్రేయసిని గొంతు పిసికి చంపేశాడు కిరణ్. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు. గర్భం తొలగించుకునే విషయంలోనే వాగ్వాదం జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?