హానీ ట్రాప్: ముగ్గులోకి లాగి..... కిలాడీ లేడీ అరెస్టు

Published : Aug 17, 2020, 07:08 AM IST
హానీ ట్రాప్: ముగ్గులోకి లాగి..... కిలాడీ లేడీ అరెస్టు

సారాంశం

అమాయకులను ముగ్గులోకి లాగి మోసం చేస్తున్న కిలాడీ లేడీని, ఆమెకు సహకరిస్తున్న వ్యక్తిని కర్ణాటకలోని హాసన్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయం పెంచుకుని ముగ్గులోకి లాగుతున్నారు.

బెంగళూరు: హనీట్రాప్ ముగ్గులోకి లాగుతున్న మహిళతో పాటు శివణ్ణ అనే వ్యక్తిని కర్ణాటకలోని హాసన్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోనియల్ ద్వారా పరిచయం చేసుకుని వారు యువకులను హానీ ట్రాప్ లోకి లాగుతున్నారు.

కర్ణాటకలోని చిక్కబళ్లాపురకు చెందిన లక్ష్మి (32), కోలార్ కు చెందిన శివణ్ణ ఆన్ లైన్ మ్యాట్రిమోనియల్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. హాసన్ కు చెందిన పరమేశ్ లక్ష్మి  లక్ష్మి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు. 2019 నుంచి వారి మధ్య పరిచయం పెరిగింది.

ఈ కాలంలోనే వివిధ కారణాలతో పరమేష్ నుంచి లక్ష్మి 6 లక్షల రూపాయల వరకు తీసుకుంది. క్రమంగా పరమేశ్ ను దూరం చేస్తూ వచ్చింది. పరమేశ్ నిలదీయడంతో అత్యాచారం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. 

దాంతో పరమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి, శివణ్ణలను అరెస్టు చేశారు. మరింత మంది అమాయకులను కూడా ముగ్గులోకి లాగి వారు మోసం చేసినట్లు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families