దారుణం: బలవంతంగా పురుగుల మందు తాగించి ప్రియురాలి హత్య, ఆ తర్వాత అతను...

Published : Mar 03, 2020, 12:27 PM ISTUpdated : Mar 03, 2020, 12:43 PM IST
దారుణం: బలవంతంగా పురుగుల మందు తాగించి ప్రియురాలి హత్య, ఆ తర్వాత అతను...

సారాంశం

ప్రియురాలి నోట్లో విషం పోసి ఆ తర్వాత ాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో చోటు చేసుకొంది. 


కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో దారుణం చోటు చేసుకొంది. పెళ్లి వాయిదా వేస్తోందనే నెపంతో ప్రియురాలి నోట్లో విషం పోశాడు ప్రియుడు.ఆ తర్వాత అతను కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందింది.

తమిళనాడు కీరనందం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఎం. నందిని 24 ఏళ్ల దినేష్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ కూడ చిన్ననాటి స్నేహితులు. వీరి మధ్య ఇటీవల అభిప్రాయభేదాలు వచ్చాయి.  కొంత గ్యాప్ వచ్చింది. దీంతో  దినేష్ నందినిని  పెళ్లి చేసుకోవాలని  వేధింపులకు దిగుతున్నాడు. 

దీంతో ఆమె దినేష్ ప్రవర్తనకు మరింత విసిగిపోయింది. గత నెల  28వ తేదీన దినేష్  నందిని ఇంటికి వెళ్లాడు. నందినితో గొడవకు దిగాడు. ఆమెను కట్టేసి బలవంతంగా ఆమె నోట్లో విషం పోశాడు. ఆ తర్వాత దినేష్ కూడ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Also read:టెక్కీ ప్రదీప్ ఫ్యామిలీ సూసైడ్: రాగి జావలో పురుగుల మందు, వాట్సాప్ గ్రూప్ నుండి వైదొలిగి

ఈ విషయం తెలిసిన నందిని కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నందిని ఇవాళ మృతి చెందింది. దినేష్ పరిస్థితి కూడ విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !