దారుణం.. తండ్రిని చంపి.. 32 ముక్కలుగా నరికి, బోరుబావిలో వేసి.. ఓ కొడుకు ఘాతుకం..

By SumaBala BukkaFirst Published Dec 14, 2022, 10:54 AM IST
Highlights

ఓ కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి.. బోరుబావిలో పడేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. 

కర్ణాటక : కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసి15 ముక్కలుగా నరికాడు. ఆ తరువాత మంటూరు బైపాస్ రోడ్డు సమీపంలోని పొలంలో ఉన్న బోరుబావిలో తండ్రి శరీర భాగాలను పడేశాడు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మృతుడు పరశురామ్ కులాలి (54), నిందితుడిని విఠల్ కులాలిగా గా గుర్తించారు.

డిసెంబరు 6న ముధోల్‌లో ఈ ఘటన జరిగింది. భర్త కనిపించకపోవడంతో మృతుడి భార్య పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేసింది. దీని మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితుడు విఠల్ నేరం అంగీకరించాడని బాగల్‌కోట్ ఎస్పీ జయప్రకాష్ తెలిపారు.మృతుడు పరశురాంకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను  మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని తెలిసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 53 ఏళ్ల పరశురాం మద్యానికి బానిసై తన ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠలను నిత్యం దుర్భాషలాడేవాడు. పరశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. డిసెంబర్ 6న పరశురాం మద్యం మత్తులో కుమారుడితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశానికి లోనైన 20 ఏళ్ల కొడుకు ఇనుప రాడ్డుతో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఇది ముధోల్ పట్టణానికి సమీపంలోని మంటూరు బైపాస్ వద్ద ఉన్న వీరి పొలంలో జరిగింది. 

విషాదం.. తోటి విద్యార్థులతో గొడవపడి 2వ తరగతి విద్యార్థి మృతి..

తండ్రిని చంపిన తరువాత మృతదేహాన్ని ఉపయోగంలో లేని బోరుబావిలో దాచడానికి ప్రయత్నించాడు. కానీ బోరుబావి వెడల్పు  6-8 అంగుళాలు మాత్రమే ఉండటంతో అది చేయలేకపోయాడు. దీంతో విఠల్ తండ్రి మృతదేహాన్ని ముక్కలుగా నరకాలని నిర్ణయించుకున్నాడు. అలాగే చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, శరీర భాగాలను బోరుబావిలో పడేశాడు.

మృతుడి భార్య సరస్వతి గత కొన్నేళ్లుగా పెద్ద కుమారుడితో కలిసి విడివిడిగా ఉంటుంది. కాగా విఠల్, పరశురాం ఒకే ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. అయితే, ఈ నేరంలో మరో వ్యక్తి కూడా తనకు సహకరించాడని నిందితుడు తెలిపాడని, అతడిని పట్టుకునేందుకు ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు.
పరశురాం భార్య సరస్వతి మిస్సింగ్‌పై ముధోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మిస్సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించామని, అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి విఠల్‌ను విచారణకు తీసుకెళ్లామని, విచారణలో అతడు మొదట సహకరించలేదని.. ఆ తరువాత గట్టిగా ప్రశ్నించడంతో వాగ్వాదం, హత్య కేసుకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్‌ను బయటపెట్టాడని తెలిపారు. నిందితుడు పదునైన ఆయుధాన్ని ఉపయోగించి తన తండ్రి మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికాడు".

ముధోల్ పోలీసులు కూడా రంగంలోకి దిగి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని మట్టి మూవర్‌తో తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపామని పోలీసులు తెలిపారు.

click me!