ఢిల్లీలో దారుణం: గర్భిణీని కాల్చి చంపిన దుండగుడు

Published : Apr 27, 2021, 05:22 PM IST
ఢిల్లీలో దారుణం: గర్భిణీని కాల్చి చంపిన దుండగుడు

సారాంశం

ఢిల్లీలో దారుణం చోటు చేసుకొంది. గర్భవతిగా ఉన్న మహిళను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. 

న్యూఢిల్లీ:ఢిల్లీలో దారుణం చోటు చేసుకొంది. గర్భవతిగా ఉన్న మహిళను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మహిళను కాపాడేందుకు ప్రయత్నించినవారిపై కూడ దుండగుడు కాల్పులకు దిగాడు.ఈ దృ
శ్యాలు  సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

హత్య చేయబడిన మహిళను సైనా గుర్తించారు. సైనా గతంలో షరఫత్  షేక్ ను వివాహం చేసుకొంది.  షరఫత్ డ్రగ్స్ కేసు లో నిందితుడిగా ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. డ్రగ్స్ కేసులో సైనా ఇటీవల అరెస్టైంది. శనివారం నాడు ఆమె బెయిల్ పై విడుదలైంది. గర్భంతో ఉన్నందున ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఏడాది క్రితం సైనా  వసీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొంది. సైనా జైలులో ఉన్న సమయంలో వసీమ్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయమై ఇవాళ ఉదయం సైనా ఇంటి వద్ద గొడవలు జరిగాయి. వసీమ్ తుపాకీ తీసి సైనాను కాల్చేందుకు ప్రయత్నించాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారుు.
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం