Honour Killing : పెద్ద కూతూరు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని.. భార్య, ఇద్దరు కూతుర్లను చంపి.. ఆత్మహత్య..

Published : Feb 18, 2022, 01:05 PM IST
Honour Killing : పెద్ద కూతూరు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని.. భార్య, ఇద్దరు కూతుర్లను చంపి.. ఆత్మహత్య..

సారాంశం

తమిళనాడులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్య, ఇద్దరు మైనర్ కూతుర్లను దారుణంగా హత్య చేశాడు. తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురు కులాంతర వివాహం చేసుకోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. 

చెన్నై : Tamil Nadu నాగపట్నం జిల్లాలో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు కూతుర్లను murder చేసి తానూ suicide చేసుకున్నాడు. తన కుమార్తె Scheduled casteనికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పరువు పోయిందన్న మనస్తాపంతో అతను ఈ ఘాతుకానికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. నాగపట్నం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి జవహర్ మాట్లాడుతూ.. నిందితుడు లక్ష్మణన్ టీ దుకాణం నడుపుతుండేవాడు. ఆయన పెద్ద కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పట్టలేని ఆగ్రహంతో మిగిలిన ఇద్దరు కూతుర్లు, భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకున్న కూతురు మాత్రం భర్తతో క్షేమంగా ఉంది.

ఈ దారుణ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. Inter-caste marriagesపై కుల వివక్ష, బంధువుల దాడులు తమిళనాడులోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ప్రబలంగా కొనసాగుతున్నాయి. 2016లో, తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఉడుమల్‌పేట్‌లో షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక యువకుడిని పట్టపగలు.. అగ్రవర్ణ హిందూ భార్య కుటుంబం కిరాయి హంతుకులతో హత్య చేయించింది. 

హంతకులు 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి వి శంకర్‌ను నరికి చంపారు. అతని భార్య కౌసల్యను తీవ్రంగా గాయపరిచారు. కౌసల్య తండ్రి చిన్నస్వామి సహా ఆరుగురికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. తరువాత, 2020లో, మద్రాస్ హైకోర్టు మహిళ తండ్రిని నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. కనీసం మరో రెండు సంఘటనలలో, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల పురుషులు అగ్రవర్ణాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్న తర్వాత రైలు పట్టాలపై శవాలుగా కనిపించారు.

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 28న లక్నోలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ యువతి వయస్సు 19 యేళ్లు.  ఓ రోజు పొలంలో స్థానికులకు dead bodyగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అది చూసిన తల్లిదండ్రులు తమ కూతురిని rape attempt చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని Postmortemకోసం తరలించారు.  యువతిపై అత్యాచారం జరగలేదని రిపోర్టులో స్పష్టమైంది.  అయితే Technologyతో పోలీసులు అసలు కథ ఏంటో తేల్చేశారు.

ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  హర్దోయ్ ప్రాంతానికి చెందిన  కమల, నరేంద్ర దంపతుల కూతురు ప్రతిభ (19). ఆమె స్థానిక కాలేజీలో చదువుకుంటుంది.  ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తరచూ  ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు.  ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారు. ఫోన్ లో అతడితో మాట్లాడకూడదని బెదిరించారు. అయినా ప్రతిభ వినకుండా ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. 

కూతురు వల్ల తమ పరువు పోతుందని తల్లిదండ్రులు భయపడ్డారు. ఈ భయంతోనే ఈ నెల 22న కమల, నరేంద్ర  కలిసి ప్రతిభ గొంతుకోసి హత్య చేశారు. ఆమె ముఖం, మెడపై  దాడి చేయడం వల్ల ఎముకలు విరిగి ఆ యువతి మృతి చెందింది.హత్య తర్వాత కమల తనతో సన్నిహితంగా ఉండే విపిన్, రామ్ నరేష్ ను పిలిపించుకుంది. వారి సహాయంతో  కూతురు మృతదేహాన్ని పొలంలో పడేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిభను హత్య చేసిన తల్లిదండ్రులు ఏమీ ఎరగనట్టు.. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు లో యువతిపై అత్యాచారం జరగలేదని స్పష్టమయింది. అయితే ఘటనా స్థలంలో దొరికిన కీప్యాడ్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఆధారంగా విపిన్ ను గుర్తించారు. అతడిని విచారించగా జరిగిందంతా చెప్పాడు వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !