New Delhi: నకిలీ పత్రాలతో ఇంటిని అద్దెకు తీసుకుని.. ఢిల్లీలో పేలుడు ప‌ద‌ర్థాల క‌ల‌క‌లం !

Published : Feb 18, 2022, 12:31 PM ISTUpdated : Feb 18, 2022, 12:36 PM IST
New Delhi: నకిలీ పత్రాలతో ఇంటిని అద్దెకు తీసుకుని.. ఢిల్లీలో పేలుడు ప‌ద‌ర్థాల క‌ల‌క‌లం !

సారాంశం

New Delhi: దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌కిలీ ప‌త్రాలతో ఓ అపార్టుమెంట్ అద్దెకు తీసుకున్న ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న బ్యాగులో మూడో కిల‌లో పేలుడు ప‌ద‌ర్థాలు (ఐఈడీ) ఉన్నట్టు  ఢిల్లీ పోలీసులు గుర్తించారు. 

New Delhi: దేశరాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి పేలుడు ప‌ద‌ర్థాలు ల‌భ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. దీనికి తోడు పేలుడు ప‌ద‌ర్థాల‌ను క‌లిగి ఉన్న నిందితులు పోలీసుల కండ్లు గ‌ప్పి పారిపోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీలోని సీమాపురిలో ఓ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాంగ్ లో లో 3 కిలోల పేలుడు ప‌ద‌ర్థాలు  (Improvised Explosive Device-IED) (ఐఈడీ) ఉన్న‌ట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ పేలుడు ప‌దార్ధాల‌ను నిర్వీర్యం చేశారు. దీనిపై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

ద‌ర్యాప్తు లో భాగంగా పోలీసులు ఆ ఇంటి యజమానిని విచారించ‌గా కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించి అనుమానాస్ప‌ద యువ‌కులు సీమాపురిలో ఓ ఇళ్లు కిరాయి తీసుకున్నారు. ఆ వ్య‌క్తులే పేలుడు ప‌దార్ధాలు తీసుకువ‌చ్చిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి ఓన‌ర్‌ను కాంట్రాక్ట‌ర్ ఖాసిమ్‌గా గుర్తించారు. వారికి అపార్టుమెంట్ ను అద్దెకు ఇచ్చేముందు య‌జ‌మాని వాటిని పూర్తిగా త‌నిఖీ చేయ‌లేదు. అలాగే, ఆయ‌న‌కు ఇచ్చిన వారి ప‌త్రాలు సైతం న‌కిలీగా పోలీసులు గుర్తించారు. 

అపార్ట్‌మెంట్ యజమాని ఖాసీం ఒక‌ కాంట్రాక్టర్. అతను షకీల్ అనే ప్రాపర్టీ డీలర్ ద్వారా భవనంలోని రెండవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే ముగ్గురు వ్య‌క్తులు అందులోకి దిగారు. ఈ త‌ర్వాత మ‌రికొంత మంది వ‌చ్చి చేరారు. మొత్తం 10 మంది వ‌ర‌కు ఈ అపార్టుమెంట్ లోకి దిగార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వారు ఈ ప్రాంతం నుంచి డ‌జ‌న్ల సంఖ్య‌లో అనుమానాస్పద ఫోన్ కాల్‌ల‌ను గుర్తించింది. ఈ క్ర‌మంలోనే పోలీసులు అక్క‌డి చేరుకోగా.. నిందితులు ముందుగానే విష‌యం ప‌సిగ‌ట్టి పారిపోయారు. 

పేలుడు ప‌ద‌ర్థాలు క‌లిగి ఉన్న నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వారి కోసం గాలింపు కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీ పోలిసు స్పెషల్ సెల్..  నిందితులను గుర్తించి వారి ఫొటోలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో ఇంకా పూర్తి వివ‌రాలు తెలియ‌లేద‌ని పోలీసులు తెలిపారు.  నిందితుల‌ను స్లీపర్ సెల్‌లో భాగమై ఉండవచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లేదా ఏదైనా పెద్ద కుట్రకు తెర‌దీయ‌డానికి వీరు న‌గ‌రానికి వ‌చ్చిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

గత నెలలో గణతంత్ర దినోత్సవానికి ముందు ఘాజీపూర్ పూల మార్కెట్ నుండి కూడా పోలీసులు పేలుడు ప‌ద‌ర్థాల‌ను స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స్వాధీనం చేసుకున్న పేలుడు ప‌ద‌ర్థాల‌తో అవి సారూప్యతను కలిగి ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు కేసులు ఒకే వ్యక్తులతో ముడిపడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అలాగే, జనవరి 29న హిమాచల్ ప్రదేశ్‌లోని కులు వద్ద కార్ పార్కింగ్‌లో జరిగిన భారీ బాంబు పేలుడుకు సంబంధించి కూడా ఈ కేసు పొల్చుతూ.. విచార‌ణ కొన‌సాగిస్తున్నారు పోలీసులు. ఘాజీపూర్ కేసులో దొరికిన IED కారు బాంబు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం స్వాధీనం చేసుకున్న ప‌ద‌ర్థాలు, సీమాపురిలో గురువారం దొరికిన ఐఈడీ ఈ ప‌ర్థాల‌ను పోలుస్తూ.. ప‌రిశీలిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !