ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు: సమీప బంధువే నిందితుడు

By narsimha lodeFirst Published Feb 14, 2020, 7:39 AM IST
Highlights

న్యూఢిల్లీలో ఒకే ఇంట్లో ఐదుగురిని హత్య చేసిన ప్రభు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంభు చౌదరి కుటుంబాన్ని డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొనేందుకు ప్రభు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేసిన కేసులో ప్రభు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలోని ఓ ఇంట్లో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈశాన్య ఢిల్లీలోని ఓ ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో  ఈ నెల 12న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగులగొట్టి చూస్తే ఆ ఇంట్లో ఐదు మృతదేహలు కన్పించాయి.  మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. మృతులను శంభు చౌదరి కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Also read:ఇంట్లో ఐదుగురు మృతి: కుళ్లిపోయి దుర్వాసన వేస్తున్న శవాలు

శంభు చౌదరి ఈ-రిక్షా న‌డుపుతూ.. భార్య సునీత, ముగ్గురు పిల్లల్ని పోషించేవాడు. శంభు వద్ద అతని దూరపు బంధువు ప్రభు రూ. 30 వేలు అప్పుగా తీసుకొన్నారు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని శంభు చౌదరి కోరారు. డబ్బులు ఇవ్వాలని పదే పదే శంభు చౌదరి ప్రభును కోరారు. అయితే శంభు చౌదరిని చంపితే ఇక డబ్బులు ఇచ్చే అవసరం ఉండదని భావించారు.

పథకం ప్రకారంగా శంభు చౌదరితో పాటు ఆయన భార్య సునీత, ఇద్దరు కొడుకు శివం, సచిన్, కూతురు కోయల్‌ను ప్రభు హత్య చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించారు. బీహార్ రాష్ట్రంలోని సుపాల్ జిల్లాకు చెందిన శంభు ఆర్నెళ్ల క్రితం కుటుంబంతో ఢిల్లీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. 

click me!