ప్రేయసిపై అత్యాచారం.. సూసైడ్ నోట్ రాసి ప్రియుడి బలవన్మరణం..

By AN TeluguFirst Published Sep 25, 2021, 5:02 PM IST
Highlights

హర్యానాలోని  హిసార్ జిల్లా బద్ధో పట్టి  గ్రామానికి చెందిన  24 ఏళ్ల సత్యప్రకాష్ అలియాస్  సోను షికార్పూర్  గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.  ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ ప్రేమజంట గురించి తెలిసి సునీల్ అనే ప్రభుత్వ ఉద్యోగి  వాళ్లను వేధించడం ప్రారంభించాడు.

హర్యానా : వారిద్దరూ 16 నెలలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా గడపాలని. ఎంతో ఆనందంగా గడుస్తున్న వారి జీవితంలో పెను తుఫాను చెలరేగింది.  ప్రేయసిపై  ఓ వ్యక్తి అత్యాచారం(Rape) చేయడంతో ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.  రెండు పేజీల లేఖ (Suicide note)రాసి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే…

హర్యానాలోని  హిసార్ జిల్లా బద్ధో పట్టి  గ్రామానికి చెందిన  24 ఏళ్ల సత్యప్రకాష్ అలియాస్  సోను షికార్పూర్  గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.  ఆమె కూడా అతడిని ఇష్టపడింది. ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆ ప్రేమజంట గురించి తెలిసి సునీల్ అనే ప్రభుత్వ ఉద్యోగి  వాళ్లను వేధించడం ప్రారంభించాడు.

అతడికి పెళ్లయి,  ఆరు నెలల బాబు కూడా ఉన్నాడు.  సోనీ  సునీల్ బ్లాక్ మెయిల్ చేస్తూ చంపేస్తానని బెదిరించాడు.  అంతటితో ఆగకుండా  అతడి ప్రేయసిని  బలవంతంగా హోటల్ కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం పాల్పడ్డాడు.  ఈ విషయం తెలిసి ప్రియుడి తట్టుకోలేకపోయాడు. రెండు పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.

నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.  ఎంతో సంతోషంగా ఉన్న మా ప్రేమ జంట మధ్యలోకి వచ్చాడు. అతడు నన్ను చంపేస్తానని బెదిరించాడు. నా ప్రియురాలి ని బలవంతంగా హోటల్ కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆమె కుటుంబ సభ్యులకు,  నాకు ప్రాణహాని ఉంది. భయంతో సునీల్ చెప్పిన మాటలు అన్నింటికీ  నా ప్రేయసి అంగీకరించింది.  రెండు నెలల నుంచి ఆమె మానసిక క్షోభ అనుభవిస్తుంది. 

టీచర్లు కావాలనుకున్నారు.. ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

దీనికి సంబంధించిన ఆధారాలు అన్నీ నా వాట్స్అప్ లో ఉన్నాయి.  నా ఆత్మహత్యకు కారణమైన సునీల్ ను కఠినంగా శిక్షించాలి. నేను, నా ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ అతను మా జీవితాలను నాశనం చేశాడు. రెండు నెలలుగా మాకు సరైన తిండి లేదు. ఒక్క చపాతీ తిని రోజులు గడుపుతున్నాం.

నేను చనిపోయిన తరువాత ఆమె బతికున్న శవంలా మారుతుందని నాకు తెలుసు. సునీల్ గురించే కాదు. ఆమె నా దగ్గర ఏ విషయాన్ని దాచకుండా అన్ని విషయాలు చెప్పేది. నా చావుకు కారణమైన సునీల్ వీలైనంత త్వరగా శిక్షించాలని పోలీసులను కోరుకుంటున్నారు. మరే జంట ఇలాంటి వ్యక్తులకు బలి కాకూడదు’ అని సూసైడ్ నోట్ లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. 
 

click me!