ఒకే కులమని ప్రేమ, ఆపై పెళ్లి: క్యాస్ట్‌పై అబద్ధం చెప్పిందని.. కట్టుకున్న భార్యని

Siva Kodati |  
Published : Jun 13, 2021, 09:43 PM IST
ఒకే కులమని ప్రేమ, ఆపై పెళ్లి: క్యాస్ట్‌పై అబద్ధం చెప్పిందని.. కట్టుకున్న భార్యని

సారాంశం

కనకపురలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లోకేశ్, హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాది వయసున్న బాబు వున్నాడు

దాదాపు ప్రతి ఒక్కరికి తమ కులం మీద అభిమానం. తమ కులం గొప్పదనో, లేదా అణచివేయబడ్డదనో ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. తనని మిగతా సమాజంతో కలిపే వేరే ఏ వేదిక బలంగా లేనప్పుడు, తరతరాలుగా బలంగా ఉన్న కులం అనేదే ఆకర్షిస్తుంది. తమ కులంలో పుట్టిన వ్యక్తులు సాధించిన విజయాల్ని తమ కులపు విజయాలుగా చెప్పుకోవడం, ఆరాధన పెంచుకోవడం జరుగుతుంది.

కులాల సమస్య మన దేశంలో ఎప్పటి నుండో ఉన్నా, గతంలో కొన్ని ఉద్యమాలు రావడం,  కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం, నాస్తికోద్యమం, హేతువాద ఉద్యమం లాంటి వాటి వల్ల కులాల మధ్య వైషమ్యాలు కాస్తయినా తగ్గాయి. కానీ దేశంలో నిత్యం ఏదో ఒక మూల కుల ఘర్షణలు, అగ్రవర్ణాల చేతిలో తక్కువ కులాలకు అవమానాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా భార్య తన  కులం దాచి అబద్ధం చెప్పిందనే అక్కసుతో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. 

Also Read:కారు వెనుక అద్దంపై కులం పేరు.. ఛలాన్ వేసిన పోలీసులు..!

కర్ణాటక రాష్ట్రంలో ఈ దారుణం జరిగింది.  కనకపురలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న లోకేశ్, హావేరి జిల్లా హానగల్లు తాలూకా ఓంకణ గ్రామానికి చెందిన గీతలు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాది వయసున్న బాబు వున్నాడు. ఇటీవల తన కులం గురించి అబద్ధం చెప్పిందని, ఆమెది తన కులం కాదని తెలుసుకున్న లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నెల 1న ఆమెను తీవ్రంగా హింసించి కొట్టాడు. అక్కడితో ఆగకుండా తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు.

ఆపై మృతదేహాన్ని మాయం చేయడానికి శవాన్ని గోనెసంచిలో కట్టి వూరి శివారులోని తన తాతకు చెందిన పొలంలో పూడ్చిపెట్టాడు. తర్వాత ఏం ఎరగన్నట్లు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఇంట్లో డబ్బు, నగలు తీసుకుని ఎవరితోనో వెళ్లిపోయిందని ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. గీత తల్లిదండ్రులను విచారించగా లోకేశ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు లోకేశ్‌ను తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం వెలుగు చూసింది. తన భార్యను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు లోకేశ్ అంగీకరించాడు. అనంతరం పోలీసులు గీత శవాన్ని వెలికితీయించి పోస్టు మార్టానికి తరలించారు.  

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport