
భారత్‌లో కరోనా కేసులు (Corona Cases) తగ్గుముఖం పట్టాయి. గత రెండు మూడు రోజులగా రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే 14 శాతం తక్కువగా కొత్త కేసులు ఉన్నాయి. తాజాగా 1,059 కరోనా మరణాలు (Corona Deaths) చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కి పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,30,814 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 4,02,47,902కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,31,648 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది.
కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కరోనా పాజిటివిటీ రేట్ కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 11.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు.. 95.64 శాతం, యాక్టివ్ కేసులు 3.16 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న (ఫిబ్రవరి 4) దేశవ్యాప్తంగా 47,53,081 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు 1,68,98,17,199 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, దేశంలో నిన్న 16,11,666 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ మొత్తం 73,58,04,280కి చేరింది.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కేరళలో 38,684, కర్ణాటకలో 14,950, మహారాష్ట్రలో 13,840, తమిళనాడులో 9,916, మధ్యప్రదేశ్‌లో 6,516 కరోనా కేసులు నమోదయ్యాయి.