రైల్వే స్టేషన్ లో అపరిచిత మహిళ బుగ్గపై ముద్దు : ఏడాది జైలు శిక్ష

Published : Apr 01, 2022, 12:51 PM IST
రైల్వే స్టేషన్ లో అపరిచిత మహిళ బుగ్గపై ముద్దు : ఏడాది జైలు శిక్ష

సారాంశం

ఓ మహిళ బుగ్గపై ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టాడు. దీంతో షాక్ అయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించింది కోర్టు..

ముంబై :  ఓ మహిళ బుగ్గపై బలవంతంగా kiss పెట్టిన వ్యక్తికి ముంబైలోని మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది పాటు కఠిన imprisonment విధించింది. దీంతో పాటు పది వేల fine  కూడా విధించింది. 2015 ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహితుడితో కలిసి  గోవాండి నుంచి లోకల్ రైలులో సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ కి వచ్చింది. ప్లాట్ ఫాం పై దిగగానే కిరణ్ హోనోవర్ (37) అనే వ్యక్తి ఆ మహిళకు సమీపంగా వచ్చి బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోవాకు చెందిన నిందితుడు కిరణ్ పై కేసు నమోదయింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కిరణ్ ను దోషిగా తేల్చి శిక్ష విధించింది. 

ముంబై హైకోర్టు ఇలాంటిదే మరో తీర్పును ఇచ్చింది. భార్యభర్తల విడాకుల కేసులో.. భరణం చెల్లింపు విషయంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త భార్యకు భరణం ఇవ్వడం మామూలే.. అయితే ఇక్కడ సంపాదనపరురాలైన భార్యే భర్తకు భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. తన మాజీ భర్తకు Maintenance చెల్లించాలని మహారాష్ట్రలోని Nanded Court ఇచ్చిన ఆదేశాలను Bombay High Court సమర్థించింది. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ తన మాజీ భర్తకు నెలకు మూడు వేల రూపాయలు చెల్లించాలని సివిల్ కోర్టు ఆదేశించింది. మహిళ పనిచేస్తున్నపాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతి నెల ఆమె జీతం నుంచి ఐదు వేల రూపాయలు మినహాయించాలని దానిని పాత బకాయిల కింద కోర్టులో డిపాజిట్ చేయాలని కోర్టు కోరింది.  

2015 సంవత్సరంలో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు భార్య కోర్టులో వాదించింి. విడాకుల తర్వాత భార్య భర్తకు ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని మహిళ తరఫు న్యాయవాది వాదించారు.
వివాహం అనంతరం తన భార్యను చదివించి ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చేలా చేశానని, ఇప్పుడు తనకు ఎలాంటి ఆదాయవనరులు లేవని, తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని భర్త చెప్పాడు. హిందూ వివాహ చట్టంలోని 24, 25 సెక్షన్ల కింద నిరుపేద జీవిత భాగస్వామికి భరణం క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పిస్తున్నామని, దిగువ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ  బాంబే హైకోర్టు జస్టిస్ డాంగ్రే ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. 

కాగా, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కోర్టు ఓ అత్యాచారం కేసులో ఇలాంటి తీర్పునే ఇచ్చింది.  జూబ్లీహిల్స్ లో ఓ బాలిక బంధువు చేతిలో మోసపోయింది. ఆ బంధువు చేసిన మోసం కారణంగా వచ్చిన Unwanted pregnancyని తొలగించుకోవడానికి ఆ బాలికకు High Court అనుమతి ఇచ్చింది. బాలిక (15)ను ఆమె బంధువు.. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటి నుంచి బయటకు తీసుకు వెళ్లి... బలవంతంగా తన లైంగిక వాంఛ తీర్చుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించాలని కుటుంబసభ్యులు Nilofar Hospital ఆశ్రయించారు. అందుకు వారు నిరాకరించారు. అబార్షన్ చేయాలంటే చట్టప్రకారం అనుమతులు అవసరం.. అని చెప్పడంతో బాలిక తరఫున ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది.

15 సంవత్సరాల బాలిక గర్భాన్ని కొనసాగించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతుందన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆమె ఇష్టపూర్వకంగానే బంధువులో వెళ్ళినా,  లైంగికంగా కలిసిన.. molestation పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. గర్భం కారణంగా  మైనర్ అయిన బాలిక వ్యక్తిగత పరువుతో జీవించే హక్కు కోల్పోతుందని… శారీరకంగా,  మానసికంగానూ  ప్రభావం ఉందని పేర్కొంది. అత్యాచారం వల్ల వచ్చిన అవాంచిత గర్భాన్ని తొలగించుకోవచ్చు అని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu