న్యూఢిల్లీలో కాల్పుల కలకలం: షోరూమ్ వెలుపల గాల్లోకి కాల్పులకు దిగిన దుండగుడు

Published : Oct 09, 2022, 11:37 AM IST
న్యూఢిల్లీలో కాల్పుల కలకలం: షోరూమ్ వెలుపల గాల్లోకి కాల్పులకు దిగిన దుండగుడు

సారాంశం

న్యూఢిల్లీలోని ఓ షోరూమ్ వెలుపల ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. షోరూమ్ యజమానిని బెదిరించడం కోసం తుపాకీతో కాల్పులకు దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని  షోరూమ్ వెలుపల తుపాకీతో ఓ దుండగుడు గాల్లోకి కాల్పులకు దిగాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బవానా పోలీస్ స్టేషన్ సమీపంలోని దరీపూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు  యువకులు మోటార్ బైక్ పై వచ్చారు. ఒకరు బైక్ పై కూర్చొని ఉండగా, మరొకరు  షోరూమ్ ముందుకు వచ్చి  తన వెంట తెచ్చుకున్న తుపాకీతో గాల్లోకి కాల్పులకు దిగాడు.

అనంతరం తుపాకీనిజేబులో పెట్టుకొని షో రూమ్ లోపలికి వెళ్లాడు. షో రూమ్ యజమానిని ని దుండగుడు రూ. 50 లక్షలు  డిమాండ్ చేసినట్టుగా  సమాచారం.షాపు యజమానిని బెదిరించి దోచుకొనేందుకే గాల్లోకి కాల్పులకు దిగినట్టుగా  పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !