షాహిన్ బాగ్ లో కాల్పులు: నిందితుడు కపిల్ గుజ్జార్ పట్టివేత

Published : Feb 01, 2020, 06:06 PM ISTUpdated : Feb 01, 2020, 06:12 PM IST
షాహిన్ బాగ్ లో కాల్పులు: నిందితుడు కపిల్ గుజ్జార్ పట్టివేత

సారాంశం

జామియాలో కాల్పులు జరిగి 48 గంటలు కూడా ముగియక ముందే ఢిల్లీలోని షాహిన్ బాగ్ లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. గాలిలోకి కాల్పులు జరిపిన ఆ వ్యక్తిని కపిల్ గుజ్జార్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని షాహిన్ బాగ్ లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పౌరసత్వ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థలంలో అతను గాలిలోకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. జసోలా రోడ్ లైట్ సమీపంలోని నిరసన శిబిరం వద్ద గల బారికేడ్ సమీపంలో అతను కాల్పులు జరిపాడు.

 

Also Read: జామియా షూటర్: స్కూల్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి..

కాల్పులు జరిపిన వ్యక్తిని కపిల్ గుజ్జార్ గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఏఏకు మద్దతుగా అతను ఆ పనికి ఒడిగట్టాడు. గాలిలోకి కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని డీసీపీ చిన్మయ్ బిస్వాల్ చెప్పారు. సంఘటనా స్థలంలో ఖాలీ బుల్లెట్ షెల్స్ కనిపించాయి. కాల్పులు జరిగిన వ్యక్తి కపిల్ గుజ్జారు నోయిడా సరిహద్దుల్లోని దల్లాపురాకు చెందినవాడని తెలుస్తోంది. 

Also Read: జామియా షూటింగ్: గన్ ఎక్కడిదంటే, విస్తుపోయే విషయాలు వెల్లడి

జామియా కాల్పులు జరిగిన 48 గంటల లోపలే ఈ సంఘటన చోటు చేసుకుంది. జనవరి 30వ తేదీన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో టీనేజ్ విద్యార్థి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.జామియా, షాహిన్ బాగ్ ప్రాంతాల్లో గత 50 రోజులుగా సీఏఏకు, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.  

 

PREV
click me!

Recommended Stories

Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్