పిల్లల సంతోషం కోసం పరితపించే ఓ తండ్రి .. నెట్టింట్లో వైరలవుతున్న హర్ట్ టచింగ్ వీడియో.. 

By Rajesh KarampooriFirst Published May 4, 2023, 7:21 PM IST
Highlights

నిత్యం నెట్టింట్లో ఎన్నో వీడియోలను చూస్తుండటం. కానీ కొన్ని వీడియోలు మాత్రమే మన హర్ట్ ను టచ్ చేస్తాయి. అలాంటి వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో తండ్రి గొప్పతనాన్ని మరింత పెంచుతోంది. ఈ వీడియో ఏంటో .. ఆ కథేంటో మీరు కూడా తెలుసుకోండి. 

నాన్న అంటే భరోసా.. నాన్న అంటే ధైర్యం.. తాను క్రొవ్వొత్తిలా కరుగుతూ తన పిల్లల కోసం పాటు పడుతాడు.  తాను రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న.నాన్న అంటే.. వేలు పట్టి నడిపించేవాడు,వేలకు వేలు కట్టి చదివించేవాడు. నిరంతర తన పిల్లల గెలుపు కోసం పరితపించేవాడు. తన పిల్లల విజయాన్ని తన విజయంగా మురిసిపోయేవాడు. ప్రతి తండ్రి తన పిల్లలకు సూపర్‌మ్యాన్ కంటే తక్కువ కాదు.  ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

ఒక్క మాటలో చెప్పాలంటే.. అనుక్షణం తన పిల్లల సంతోషం కోసం తపించే మహ్నోన్నత వ్యక్తి. ఇలా తన పిల్లల సంతోషం కోసం పరితపించే ఓ తండ్రి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పటివరకు 9 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించగా.. వేలాది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  ఆ తండ్రిని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో  అంతా ప్రత్యేకతేముంది? ఆ తండ్రి పిల్లల సంతోషం కోసం ఏం చేశారు ? అని అనుకుంటున్నారా? అయితే.. వెంటేనే ఈ సోర్టీని చదివేయండి.  
 
నిజానికి నెట్టింట్లో వైరలవుతున్న వీడియోలో కొందరు వ్యక్తులు పార్క్‌లో డ్యాన్స్ చేస్తూ రీల్‌ను రికార్డ్ చేస్తున్నారు. అదే సమయంలో ఓ తండ్రి తన పిల్లలతో పార్కుకు వచ్చారు. వారి డ్యాన్స్ చూసిన వారి దగ్గరకి వెళ్లి మా పిల్లలను మీతో డ్యాన్స్ చేయడానికి అనుమతించగలరా? అని వారిని అడిగారు. ఆ ప్రశ్నకు షాక్ అయినా.. డాన్సర్స్ .. తప్పకుండా అంటూ.. అతని పిల్లలకు స్వాగతం పలికారు. 

కానీ, అతని కూతురు మొదట సంశయించింది. కానీ ఆ తండ్రి తన కూతురుని మోటివేట్ చేశాడు.  “మీకు తెలిసినది చేయి.. నీకు నచ్చినట్టు చేయి అమ్మా.. చేస్తూ చేస్తూంటే.. అదే వస్తుంది ”అని ఎంకరేజ్ చేశారు. తండ్రి ఇచ్చిన ధైర్యంతో ఆ కూతురు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఆ సందర్బంలో తండ్రి ముఖంలో కనిపించే చిరునవ్వు, ఆ ఆనందానికి అసలు వెలకట్టలేం..నిజంగా ఈ వీడియో చాలా హర్ట్ టచింగ్ గా ఉంది. ఆ డ్యాన్సర్లతో స్టెప్పులు వేయడానికి తన కొడుకు కూడా వచ్చాడు. అతడు స్టెప్పులేస్తూ..  “డాడీ యే మేరా హీరో హై” అనడం కూడా ఆ వీడియోలో వినవచ్చు. వైరల్ అవుతున్న వీడియోను సాధన అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ సూపర్ డాడీని ప్రశంసిస్తున్నారు. పొగడ్తలతో ముంచెత్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sadhana 🧿 (@sadhnaaaa__)

click me!