ఆడవాళ్లు కూడా ఇంత అందంగా చీర కట్టరేమో..!

Published : Dec 20, 2022, 09:42 AM IST
ఆడవాళ్లు కూడా ఇంత అందంగా చీర కట్టరేమో..!

సారాంశం

ఎంత అందంగా కట్టుకున్నాడంటే... అమ్మాయిలు కూడా ఇంత అందంగా కట్టుకోరేమో చీర అని సందేహం వచ్చేలా కట్టాడు. అంతేకాదు.. రెప్ప మూసి తెరిచేలోగా... వేగంగా చీర కట్టుకోవడం గమనార్హం.

వస్త్ర దుకాణంలో చాలా మంది అబ్బాయిలు పని చేస్తూ ఉండటం మీరు గమనించే ఉంటారు. వాళ్లు... చీరలను అందంగా ప్రదర్శించి.. దుకాణంకి వచ్చిన వారికి అమ్ముతుంటారు. ఇలానే ఓ సేల్స్ మెన్ చీరను చాలా అందగా ప్రదర్శించాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే... అందరిలాగా... కొనడానికి వచ్చిన వారికి చీర కట్టో.. లేదంటే.. కేవలం భుజం మీద చీర వేసో చూపించలేదు. తనకే అందంగా కట్టుకున్నాడు. ఎంత అందంగా కట్టుకున్నాడంటే... అమ్మాయిలు కూడా ఇంత అందంగా కట్టుకోరేమో చీర అని సందేహం వచ్చేలా కట్టాడు. అంతేకాదు.. రెప్ప మూసి తెరిచేలోగా... వేగంగా చీర కట్టుకోవడం గమనార్హం.

 

పూర్తి వివరాల్లోకి వెళితే.... పంజాబీ టచ్ అనే ట్విట్టర్ ఎకౌంట్ లో ఈ వీడియోని షేర్ చేశారు. అందులో.. పంజాబీ కుర్రాడు.. కేవలం పది సెకన్లలో చీర కట్టడం పూర్తి చేశాడు. దుస్తుల దుకాణంలోని టేబుల్ పై  నిలపడి... నలుపు రంగు చీరను కేవలం పది అంటే... పది సెకన్లలో పూర్తి చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంత అందంగా చీర కడితే.. ఎవరైనా వెంటనే చీర కొనేస్తారు అని కొందరు కామెంట్ చేస్తుంటే... అమ్మాయిలు కూడా ఇంత సింపుల్ గా, ఫాస్ట్ గా, అందంగా చీర కట్టుకోలేరేమో అంటూ కొందరు కామెంట్ చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !