వైరల్ వీడియో : కదులుతున్న కారు మీద యువకుడి పుషప్స్.. ట్విస్టిచ్చిన పోలీసులు..

By AN TeluguFirst Published Mar 16, 2021, 1:28 PM IST
Highlights

సరదా కోసం చేసిన పని ఆ యువకుడిని భారీ మూల్యం చెల్లించేలా చేసింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రన్నింగ్ కారు మీదికి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

సరదా కోసం చేసిన పని ఆ యువకుడిని భారీ మూల్యం చెల్లించేలా చేసింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రన్నింగ్ కారు మీదికి ఎక్కి పుషప్స్ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. 

వివరాల్లోకి వెడితే.. ఉజ్వల యాదవ్‌ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్‌ చేస్తూ షికారు కెళ్లాడు. వెళ్లినవాడు వెళ్లకుండా రోడ్డమీదికి రాగానే స్టంట్స్ మొదలెట్టాడు.డ్రైవ్‌ చేస్తున్న స్టీరింగ్‌ వదిలేసి కారుమీదికి ఎక్కాడు. ఎక్కి రన్నింగ్ లో ఉన్న కారుమీద పుషప్స్ చేయడం మొదలుపెట్టాడు. 

దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. దీన్ని 61 వేల మంది చూశారు. వందలాది మంది కామెంట్‌ చేశారు. నెట్టింట చక్కర్లు కొట్టిన ఈ వీడియో చివరికి  ఉత్తరప్రదేశ్ పోలీసుల కంట్లో పడింది.

ఇంకేముంది ఉజ్వల్ చేసిన ఘనకార్యానికి పోలీసులు తమస్టైల్లో తగిన మూల్యం విధించారు. కొన్ని పుషప్స్ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్ కదా.. నీ  కష్టానికి ఇదిగో బహుమతి.. అంటూ అతనికి భారీగా చలాన్ విధించారు. డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని, ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించొచ్చని.. యూపీ పోలీసలు తమ ట్విటర్ లో పేర్కొన్నారు. 

ఇతన్ని చూసి ఇలా చేయాలని ఎవరైనా చేయాలని ట్రై చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్‌ అధికారి అజయ్ కుమార్ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

స్టంట్స్ తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్ కు చివరికి పోలీసులు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ, మరోసారి రిపీట్ చేయనంటూ చెప్పడం కొసమెరుపు. 

click me!