ఇంటినుంచి పారిపోతున్న యువతి కిడ్నాప్, అత్యాచారం...

Published : Mar 16, 2021, 11:41 AM IST
ఇంటినుంచి పారిపోతున్న యువతి కిడ్నాప్, అత్యాచారం...

సారాంశం

తల్లిదండ్రుల మాటలు చేదుగా భావించిందో యువతి.. స్వేచ్ఛ అంటూ అర్థరాత్రి ఇంటినుండి బైటికి వచ్చింది.. అంతే మృగాడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురై ఆపదలో చిక్కుకుంది. లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 

తల్లిదండ్రుల మాటలు చేదుగా భావించిందో యువతి.. స్వేచ్ఛ అంటూ అర్థరాత్రి ఇంటినుండి బైటికి వచ్చింది.. అంతే మృగాడి చేతికి చిక్కింది. అత్యాచారానికి గురై ఆపదలో చిక్కుకుంది. లక్నోలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 

అసలే రోజుల బాలేవు.. ఒంటరిగా బైటికి వెళ్లకు, స్నేహితులు, షికార్లంటూ బయట తిరగడం మంచిది కాదు.. ఎవర్నీ నమ్మేలా లేవు రోజులు అని తల్లిదండ్రులు చెబుతున్న హెచ్చరికలు ఓ యువతికి నచ్చలేదు. అంతేకాదు ఇల్లు జైలులా కనిపించింది. స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు జీవించాలని ఆశించింది. 

స్వేచ్ఛకోసం అర్థరాత్రి ఇంట్లోనుండి బైటికి వెళ్లింది. మరుక్షణమే మృగాడి చేతికి చిక్కి.. అత్యాచారానికి గురయ్యింది. బాధితురాలిని కాపాడడం కోసం వచ్చిన ఆమె అంకుల్ మీద కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. 

వివరాల్లోకి వెడితే.. ఉత్తరప్రదేశ్ అలీగఢ్ కు చెందిన బాధితురాలు ఇంట్లో తనకు స్వేచ్ఛ లేదని నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి ఇంట్లోనుంచి బైటికి వచ్చింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా కారులో అటుగా వెడ్తున్న నిందితుడు.. యువతిని చూశాడు. యువతి దగ్గరికి వచ్చి కత్తితో బెదిరించి కారులో తీసుకెళ్లాడు. అరిస్తే చంపేస్తానంటూ హెచ్చరించి ఆమెపై అత్యాచారం చేశాడు. 

అయితే యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెని వెతకడం ప్రారంభించారు. వీరిని గమనించిన యువతి సాయం కోసం పెద్దగా ఏడ్వడం ప్రారంభించింది. దాంతో బాధితురాలి అంకుల్ ఆమెని కాపాడటం కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో అతడిపై దాడి చేశాడు.

ఈ లోపు మిగతా కుటుంబ సభ్యులు అక్కడకి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu