కష్టమర్ కి బ్యాంక్ తిప్పలు... షాకిచ్చిన కన్స్యూమర్ కమిషన్

By telugu news teamFirst Published Feb 3, 2021, 2:23 PM IST
Highlights

అన్ని చెల్లింపులూ సక్రమంగా, నిర్దిష్ట గడువులోగానే చెల్లిస్తున్నప్పటికీ.. అనవసరంగా లేని పోని చార్జీలను చూపిస్తూ ఎక్కువ మొత్తంలో బ్యాంకు బిల్లులు వస్తుండడంతో దెవెన్ విసిగిపోయాడు. 

ఓ బ్యాంక్.. తమ కష్టమర్ ని నానా తిప్పలు పెట్టింది. అతనిపై తప్పుడు ప్రచారం చేసి.. ఇబ్బందులకు గురిచేసింది. కాగా.. అలా వినియోగదారుడిని ఇబ్బంది పెట్టిన సదరు బ్యాంక్ కి వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. సదరు కష్టమర్ కి జరిమానా గా రూ.50వేలు చెల్లించాలని ఆదేశించడం గమనార్హం. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా  ఉన్నాయి.

గుజరాత్ లోని స్థానిక థల్ తేజ్ ప్రాంతలో నివసించే దెవెన్ దగ్లి అనే వ్యక్తికి 2001 నుంచి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకులో క్రెడిట్ కార్డు ఉంది. అయితే అన్ని చెల్లింపులూ సక్రమంగా, నిర్దిష్ట గడువులోగానే చెల్లిస్తున్నప్పటికీ.. అనవసరంగా లేని పోని చార్జీలను చూపిస్తూ ఎక్కువ మొత్తంలో బ్యాంకు బిల్లులు వస్తుండడంతో దెవెన్ విసిగిపోయాడు. బ్యాంకుకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తన క్రిడిట్ కార్డు సర్వీసును రద్దు చేయాలంటూ బ్యాంకును కోరాడు.

దీనిపై విచారణ జరిపిన కమిషన్ బ్యాంకుకు జరిమనా విధించింది. అయితే దెవెన్ కోరినట్లు రూ.40 లక్షలు కాకుండా రూ.60వేలు చెల్లించాలని తన తీర్పులో పేర్కొంది. వినియోగదారుడి వివరాలను గోప్యంగా ఉంచాలనే రిజర్వు బ్యాంకు నిబంధనలను స్టాండర్డ్ బ్యాంక్ అతిక్రమించిందని, దాని కారణంగానే ఈ జరిమానా విధించడం జరిగిందని పేర్కొంది. ఈ మొత్తాన్ని బాధితుడికి 2 నెలల్లో చెల్లించాలని, లేకుంటే ఆపైన మరో రూ.5000 అధికంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

click me!