కూతురితో సవతి తండ్రి ప్రేమాయణం... తల్లికి తెలియడంతో..

Published : Jul 09, 2021, 01:07 PM ISTUpdated : Jul 09, 2021, 01:10 PM IST
కూతురితో సవతి తండ్రి ప్రేమాయణం... తల్లికి తెలియడంతో..

సారాంశం

తండ్రిలా ఉండాల్సిన తన భర్త.. కూతురితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు.  ఈ విషయం తెలుసుకొని ఆమె షాక్ అయిపోయింది. ఇది తప్పని.. నిర్ణయం మార్చుకోవాలంటూ ఇటూ భర్తకీ.. అటు కూతురికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. 

ఆమెకు పెళ్లై ఓ కుమార్తె ఉంది. అయితే.. భర్త దూరమవ్వడంతో.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తన కుమార్తెకు ఓ తండ్రి దొరికాడని ఆమె సంబరపడింది. కానీ..  చివరకు ఆమెకు ఊహించని షాక్ తగిలింది. తండ్రిలా ఉండాల్సిన తన భర్త.. కూతురితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు.  ఈ విషయం తెలుసుకొని ఆమె షాక్ అయిపోయింది. ఇది తప్పని.. నిర్ణయం మార్చుకోవాలంటూ ఇటూ భర్తకీ.. అటు కూతురికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ.. వారు ఆమె మాటలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా ఈమెకు తెలియకుండా.. లేచిపోయారు. ఈ సంఘటన ఇండోర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండోర్ కి చెందిన ఓ మహిళ బుధవారం పోలీసులను ఆశ్రయించింది. తన కూతురితో... తన రెండో భర్త పారిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. 

తనకు 15 రోజుల క్రితమే సంతోష్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి అయిందని, తనకు అది ద్వితీయ వివాహమని, మొదటి భర్త వల్ల తనకు ఓ కూతురు ఉందని చెప్పింది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత సవతి కూతురితో సంతోష్ ప్రేమాయణం మొదలుపెట్టాడని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఎంత నచ్చచెప్పినా వినకుండా ఇంటి నుంచి వారిద్దరూ వెళ్లిపోయారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?