నడి వీధిలో మహిళ ముక్కుకోసిన వ్యక్తి.. వేధింపుల కేసు పెట్టిందని మూడేళ్ల తరువాత ప్రతీకారం..

Published : Apr 05, 2023, 09:22 AM IST
నడి వీధిలో మహిళ ముక్కుకోసిన వ్యక్తి.. వేధింపుల కేసు పెట్టిందని మూడేళ్ల తరువాత ప్రతీకారం..

సారాంశం

ఓ వ్యక్తి ప్రతీకారంతో నడి వీధిలో మహిళ ముక్కు కోసి పరారయ్యాడు. వేధింపుల కేసు పెట్టిందని కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 

ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మహిళ మీద దాడి చేసి.. ఆమె ముక్కు కోసేశాడు. ఆమెను వేధింపులకు గురిచేసిన అతను.. దానిమీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలిసింది. ఈ ఘటన సోమవారం ఉత్తర ప్రదేశ్ లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ బాజ్ పాయ్ ఇలా వివరాలు చెప్పుకొచ్చారు..రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామ నివాసి. మూడేళ్ల క్రితం ఓ మహిళను వెంటపడి వేధింపులకు గురి చేశాడు.

దీంతో విసిగిపోయిన ఆ మహిళ పోలీస్ స్టేషన్లో రాజేష్ మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు అప్పటినుంచి అతను ఆమె మీద కక్ష పెంచుకున్నాడు.  ప్రతీకారం తీర్చుకోవడానికి అదన కోసం వేచి చూస్తున్నాడు.  సోమవారం సాయంత్రం ఆ మహిళ మార్కెట్ కు వెళుతుండడం గమనించాడు.. వెంటనే ఆమె మీద దాడి చేసి..  అందరూ చూస్తుండగానే కొడవలితో ఆమె ముక్కు కోసేసాడు.

కేరళలో అమానుషం.. ఇంట్లో ప్రసవించి, పసికందుకు బట్టలో చుట్టి బకెట్ లో వదిలేసిన మహిళ...

తీవ్ర రక్తస్రావం కావడంతో మహిళ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  స్థానికుల సమాచారం ప్రకారం నిందితుడు రాజేష్  కుమార్గా గుర్తించారు.  అతని మీద కేసు  నమోదు చేశారు.  అతని కోసం గాలిస్తున్నట్లుగా  తెలిపారు.  మూడేళ్ల కిందట ఆ మహిళ రాజేష్ కుమార్ మీద వేధింపులకు కేసు పెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని వారు అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu