గర్ల్‌ఫ్రెండ్‌పై రివేంజ్.. పెళ్లికి బాంబ్ పెట్టిన హోమ్ థియేటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అది పేలి ఆమె భర్త దుర్మరణం

Published : Apr 05, 2023, 03:56 AM IST
గర్ల్‌ఫ్రెండ్‌పై రివేంజ్.. పెళ్లికి బాంబ్ పెట్టిన హోమ్ థియేటర్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అది పేలి ఆమె భర్త దుర్మరణం

సారాంశం

గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నదని అసంతృప్తితో ఉన్న ఆమె లవర్ పెళ్లికి బాంబ్‌ పెట్టిన హోమ్ థియేటర్‌ను బహుకరించాడు. ఆమె భర్త హోమ్ థియేటర్‌ను ఆన్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఇంట్లో పేలుడు సంభవించింది.  

గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుందన్న విషయాన్ని ఓ దుర్మార్గుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమెకు ప్రమాదం తలపెట్టాలనే తలంపుతోనే పెళ్లికి ఓ హోమ్ థియేటర్‌ను గిఫ్ట్‌గా తీసుకెళ్లాడు. అయితే, అందులో బాంబ్‌ను పెట్టాడు. పెళ్లైన తర్వాత ఇంటిలో తీరికగా ఉన్నప్పుడు ఆమె భర్త గిఫ్ట్‌గా వచ్చిన హోమ్ థియేటర్ ఓపెన్ చేశాడు. కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. వెంటనే అది పేలిపోయింది. ఈ ఘటనలో ఆ నూతన వరుడు స్పాట్‌లోనే మరణించాడు. అతని సోదరుడు కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన a\ఛత్తీస్‌గడ్‌లోని కబిర్‌దామ్ జిల్లాలో చోటుచేసుకుంది.

22 ఏళ్ల హేమేంద్ర మేరావి ఏప్రిల్ 1వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అయితే, మేరావి భార్యను అంతకముందు ఒకరు ప్రేమించారు. తనను మోసం చేసిందనే కోపంతో ఆ యువకుడు ఆమె పెళ్లికి బాంబ్‌ పెట్టిన హోమ్ థియేటర్‌ను గిఫ్ట్ ఇచ్చాడు. ఆ ఇంటిలో కరెంట్ కనెక్షన్ ఇచ్చి హోమ్ థియేటర్ ఆన్ చేసే ప్రయత్నంలో పడిపోయాడు. వెంటనే అది పేలిపోయింది. 

ఆ పేలుడు ధాటికి ఇంటి గోడ కూలింది. రూఫ్ కూడా కొంచెం డ్యామేజీ అయింది. మేరావి అక్కడికక్కడే మరణించాడు. ఆయన సోదరుడిని హాస్పిటల్ తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి చికిత్స తీసుకుంటూనే మరణించాడు. 

Aslo Read: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎజెండా: జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్.. పొత్తులపై వ్యాఖ్య

ఆ బాంబ్ హోమ్ థియేటర్‌లో ఏర్పాటు చేసినందు వల్లే పేలుడు జరిగిందని పోలీసులు అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సర్జును అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో సర్జు నిజాన్ని అంగీకరించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకోవటాన్ని తాను తట్టుకోలేకపోయానని వివరించారు. అందుకే బాంబ్‌ను వాళ్ల ఇంటిలోకి బాంబును తీసుకెళ్లేలా హోమ్ థియేటర్‌ను ప్లాన్ చేశారు.

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?