ఏడేళ్ల ప్రేమ..15రోజుల క్రితం పెళ్లి.. అంతలోనే..!

Published : Jun 01, 2023, 09:55 AM IST
ఏడేళ్ల ప్రేమ..15రోజుల క్రితం పెళ్లి.. అంతలోనే..!

సారాంశం

ఇంట్లోవారికి తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. సడెన్ గా తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే, పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు.

వారిద్దరూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పదిహేను రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. కానీ వారి మధ్య  ఏం జరిగిందో తెలీదు దూరం ఏర్పడింది. ఆ దూరాన్ని ఆ భర్త తట్టుకోలేక పోయాడు. తన భార్య తనను దూరం పెట్టడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చివరగా ఆమెకు అతను పంపిన మసేజ్ చూస్తే  ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పరిధి బంగంగా ప్రాంతానికి చెందిన రాహుల్(23) అనే యువకుడు ఏడు సంవత్సరాలుగా తమ సమీప బంధువైన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అతనినే ప్రేమించేది. ఇంట్లోవారికి తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. సడెన్ గా తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే, పెళ్లికి ఒప్పుకోరని భయపడ్డారు.

ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగి 15 రోజులు అవుతుండగా, అమ్మాయిని వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల ఇంటికి తీసుకుపోయారు. మళ్లీ వస్తుంది లే అని ఈ యువకుడు ఎదురు చూస్తూ ఉండగా, ఆ అమ్మాయి సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త పైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా  పెళ్లి చేసుకున్నాడంటూ ఆరోపించింది. అంతవరకూ తనతో సంతోషంగా ఉన్న భార్య.. సడన్‌గా ఇలా ప్రవర్తించడాన్ని రాహుల్ జీర్ణించుకోలేకపోయాడు. కొన్ని రోజులుగా అతను పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

తాను ఎంతగానో ప్రేమించిన భార్య సడెన్ గా ఇలా చేయడంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాయడం విశేషం. చనిపోయే ముందు తన భార్యకు కూడా ఓ మెసేజ్ చేశాడు. తాను చనిపోతున్నానని, ఒక్కసారి వచ్చి తనను హత్తుకోమని కోరుతూ మెసేజ్ పంపడం విశేషం. అతని మృతితో వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu