భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక భర్త కూడా...

Published : Mar 05, 2021, 09:32 AM IST
భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక భర్త కూడా...

సారాంశం

తన భార్య లేని జీవితం తనకు అవసరం లేదంటూ.. ఆమె అంత్యక్రియలు నిర్వహించే సమయంలోపే ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు

భార్య దూరమవ్వడాన్ని ఆమె భర్త తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకొని భార్య చనిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. తన భార్య లేని జీవితం తనకు అవసరం లేదంటూ.. ఆమె అంత్యక్రియలు నిర్వహించే సమయంలోపే ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైసూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మైసూరు జిల్లా హుణసోరు తాలుకా హోస రామనహళ్లి గ్రామానికి చెందిన సిద్ధప్పాజీ నాయక్‌ (37), అనితా(30) దంపతులు. వీరికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న సంసారం. అయితే బుధవారం రాత్రి దంపతుల మధ్య ఏదో గొడవ జరగడంతో అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 

వెంటనే ఆమెను మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించింది. భార్య లేని జీవితం వ్యర్థమని కుమిలిపోయిన సిద్ధప్పాజీనాయక్‌ ఆమె అంత్యక్రియల సమయంలో పురుగుమందు బిళ్లలు వేసుకున్నాడు. స్పృహ తప్పిపడిపోయిన అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు భార్యకు అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే భర్త అంత్యక్రియలు కూడా జరిపారు.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?