ఎస్సై అవ్వాలనుకున్నాడు.. హైట్ తక్కువున్నాడు.. ఏం చేశాడు..?

First Published Jun 30, 2018, 5:46 PM IST
Highlights

ఎస్సై అవ్వాలనుకున్నాడు.. హైట్ తక్కువున్నాడు.. ఏం చేశాడు..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అంకిత్ కుమార్.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నది కల. అందుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు. తాజాగా ఎస్సై ఉద్యోగాల కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు.. రాత పరీక్షను విజయవంతంగా ముగించగా.. ఫిజికల్ టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే నియమనిబంధనలకు తగినంతగా ఎత్తు లేకపోవడం అతనికి శాపంగా మారింది.. దీంతో ఎత్తు కోసం మందులు వాడుతూ.. ఎక్సర్‌సైజులు చేశాడు..

అయినప్పటికి అంగుళం కూడా పెరగలేదు.. దీంతో ఎలాగైనా టెస్ట్ పాసవ్వాలని భావించి.. జుట్టులో హెన్నా పెట్టుకుని టెస్టులకు హాజరయ్యాడు.. అన్ని టెస్టులు పూర్తి చేసి.. చివరకు ఎత్తు కొలిచే సమయంలో మెషీన్ మెటాలిక్ ప్లేట్‌కు, జుట్టుకు గ్యాప్ ఉండటం అక్కడి అధికారులకు అనుమానం తెప్పించింది. దీంతో అతన్ని పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేయగా.. జుట్టులో పెట్టిన హెన్నా బయటపడింది.

దానిని తొలగించి మరోసారి ఎత్తు కొలవగా.. ఒక సెంటిమీటర్ హైట్ తగ్గింది.. దీంతో అంకిత్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో పాటు ప్రభుత్వాధికారులను మోసం చేసినందుకు గానూ... సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టి.. అతన్ని అరెస్ట్ చేశారు.. తాను చేసింది తప్పేనని..అయితే గత్యంతరం లేకే ఇలా చేశానని.. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని వారిని అధికారులను వేడుకుంటున్నాడు. 

click me!