
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో సోమవారం తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు.
ఈ దాడిలో కుమార్తె క్షేమంగా ఉండగా వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.సీసీటీవీ ఫుటేజీలో చూపించిన దాని ప్రకారం.. బాధితుడు ఇరుకైన సందులో రోడ్డుపై నడుచుకుంటూ వెడుతున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెను భుజాలపై ఎక్కించుకున్నాడు.
రైళ్లలో ట్రాలీ బ్యాగ్‌లే టార్గెట్.. జంటను పట్టుకున్న మధ్యప్రదేశ్ జీఆర్పీ పోలీసులు
ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి తుపాకీని తీసి అత్యంత సమీపం నుంచి కాల్చాడు. దీంతో బాధితుడు వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అతని కుమార్తె కూడా పక్కకు పడిపోయింది. దాడి చేసిన వ్యక్తిని అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుండి పారిపోయారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు, షోయబ్ అనే 30 ఏళ్ల వ్యాపారి, షాజహాన్‌పూర్‌లోని తన కుటుంబీకుల ఇంటికి వెళుతున్నాడు. నిందితుల్లో ఇద్దరు గుఫ్రాన్, నదీమ్‌లను అరెస్ట్ చేశాం. బైక్‌ను కూడా సీజ్ చేశాం. మూడో నిందితుడు తారిఖ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీనియర్ పోలీసు అధికారి అశోక్ మీనా తెలిపారు. నిందితుల్లో ఒకరు బాధితుడి బంధువు అని, పాత వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.