
బెంగళూరు : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యతో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నాడని అనుమానిస్తూ స్నేహితున్ని అతి దారుణంగా హతమార్చాడో వ్యక్తి. స్నేహితుడి గొంతు కోసి రక్తం తాగేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణం చూసి స్థానికులు షాక్ గురయ్యారు.
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని చికబళ్లాపూర్ కు చెందిన విజయ్, మారేశ్ స్నేహితులు. తన కోసం తరచూ ఇంటికివచ్చే మారేశ్ భార్యతో సన్నిహితంగా మాట్లాడటంతో విజయ్ కు అనుమానం మొదలయ్యింది. భార్యకు మాయమాటలు చెప్పి మారేశ్ లోబర్చుకున్నాడని అనుమానించడం ప్రారంభించాడు. రోజురోజుకు అతడి అనుమానం ఎక్కువై భార్యతో మారూశ్ అక్రమసంబంధం పెట్టుకున్నాడని నిర్దారణకు వచ్చాడు. దీంతో స్నేహితుడిపై కోపంతో రగిలిపోయిన విజయ్ దారుణానికి ఒడిగట్టాడు.
మాట్లాడేది వుందంటూ స్నేహితుడు మారేశ్ ను పిలిచాడు విజయ్. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ముందుగానే మారేశ్ చంపాలనే ప్లాన్ తో వచ్చిన విజయ్ వెంటతెచ్చుకున్న పదునైన కత్తితో గొంతు కోసాడు. తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయిన అతడిని వదల్లేదు. మారేశ్ గొంతులోంచి చిమ్ముతున్న రక్తాన్ని తాగేందుకు విజయ్ ప్రయత్నించాడు.
Read More గిరిజన మహిళపై వలసకూలీల అత్యాచారం, మెడవిరిచి హత్య..
నడిరోడ్డుపై ఈ హత్య జరగడంతో రోడ్డున వెళ్లేవారు వీడియోలు తీసారు. ఈ క్రమంలోనే మారేశ్ రక్తాన్ని తాగేందుకు విజయ్ ప్రయత్నించడం కూడా కొందరు వీడియో తీసారు. ఇలా విజయ్ రాక్షసంగా ప్రవర్తిస్తూ అత్యంత కౄరంగా స్నేహితున్ని చంపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్ దాడిలో తీవ్రంగా గాయపడిన మారేశ్ ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో వున్న మారేశ్ కోసం గాలిస్తున్నారు.