ఫించన్ డబ్బుల కోసం తండ్రిని కొట్టి, చిత్రహింసలు పెట్టి చంపిన కొడుకు..

Published : Feb 07, 2022, 02:20 PM IST
ఫించన్ డబ్బుల కోసం తండ్రిని కొట్టి, చిత్రహింసలు పెట్టి చంపిన కొడుకు..

సారాంశం

తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుల కోసం దారుణానికి తెగబడ్డాడో కొడుకు. డబ్బులు ఇవ్వడానికి తండ్రి నిరాకరించాడని కిరాతకంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి.. వైద్యం కూడా చేయించకుండా.. అతని చావుకు కారణమయ్యాడు. 

మహారాష్ట్ర : మనీ సంబంధాలు మనుషుల మధ్య బంధాలను దూరం చేస్తున్నాయి. money కోసం సొంత వారిపైనే కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా తండ్రికి వచ్చే Pension డబ్బులను తనకు ఇవ్వాలని కుమారుడు అడిగాడు. డబ్బు ఇచ్చేందుకు father నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి.. హతమార్చాడు. ఇంతకీ ఆ డబ్బు..వేలు, లక్షలు కాదు. కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే. విస్మయానికి గురి చేస్తున్న ఈ ఘటన maharashtraలో జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జవహర్ ప్రాంతంలో జాను మాలి నివసిస్తున్నాడు. తనకు వచ్చే పింఛను డబ్బులు నుంచి రూ.900ను బ్యాంకు ఖాతా నుంచి విత్ డ్రా చేశాడు.

ఆ డబ్బును తనకు ఇవ్వాలని కొడుకు రవీంద్ర మాలి అడగగా.. ఇచ్చేందుకు జాను నిరాకరించాడు. ఈ ఘటనతో రవీంద్ర తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తండ్రి జానును.. రవీంద్ర మాలి చితకబాదాడు. దీంతో దెబ్బలు తాళలేక జాను కేకలు వేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రవీంద్ర నుంచి జానును విడిపించి.. మొఖాడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

అప్పటికే దెబ్బల తాకిడికి పరిస్థితి విషమించడంతో నాసిక్ కు తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే నిందితుడు రవీంద్ర మాలి తన తండ్రి జానూ మాలిని నాసిక్ కు తరలించకుండా ఇంటికి తీసుకెళ్ళాడు. దీంతో మరుసటి రోజే జానూ మాలి చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవీంద్ర మాలిని అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఇదిలా ఉండగా, Uttar Pradeshలోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ Dalit girlపై ఇద్దరు దుండగులు gang rapeకి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను murder చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై firingకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నవాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి  గ్రామంలోని పంట పొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక dead bodyని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ మార్కండేయ షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా  పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగానే నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పట్టించిన వారికి రూ.25,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది. 

గ్రామం సమీపంలోని ఓ చెరుకుతోటలో నిందితులు తలదాచుకున్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు.  పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేష్ యాదవ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోష్ మిశ్రా తెలిపారు.  త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu