కొడుకును కరిచిందని.. కొట్టి చంపాడు.. పెంపుడు కుక్కపై యజమాని అమానుషం...

By AN TeluguFirst Published Dec 2, 2021, 3:09 PM IST
Highlights

గ్వాలియర్ జిల్లాలో ఓ అమానవీయ ఘటన వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి అతి దారుణంగా కుక్క ప్రాణాలు తీశాడు. గ్వాలియర్ జిల్లా సిమారియాతల్ గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 

విశ్వాసానికి మారుపేరు కుక్క. అందుకే దాన్ని పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు తోక ఊపుకుంటూ యజమానికి అత్యంత విశ్వాసంగా ఉంటుంది. కుక్కల్ని పెంచుకోవడమే కాదు వాటిని ఇంటి సభ్యుల్లా ట్రీట్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే దాన్ని కుక్క అంటే కూడా ఒప్పుకోరు. దాని ముద్దు పేరుతో మాత్రమే పిలవాలంటారు. తమలో ఒకరిగా చూడాలని పట్టుబడుతుంటారు. అదే.. మనిషికి, శునకానికి ఉన్న బంధం. అయితే కొన్నిసార్లు కొంతమంది చర్యల వల్ల ఈ బంధం బీటలువారుతుంటుంది. 

అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. గ్వాలియర్ జిల్లాలో ఓ Inhumane incident వెలుగు చూసింది. మూగజీవి పట్ల ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన కుమారుడిని కరిచిందన్న కోపంతో ఓ వ్యక్తి అతి దారుణంగా dog ప్రాణాలు తీశాడు. గ్వాలియర్ జిల్లా సిమారియాతల్ గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. 

దీనికి సంబంధించిన వీడియో.. social mediaల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నిందితుడు.. శునకాన్ని చితకబాదుతున్నట్లుగా కనిపించింది. అది నొప్పితో విలవిలాడుతున్న క్రమంలో దాని కాలిని పదునైన ఓ కత్తితో కోయడం కనిపించింది. 

అతనిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) కార్యకర్తలు డిమాండ్ చేశారు. పెటా కార్యకర్త ఛాయా తోమర్ ఫిర్యాదుతో నిందితుని మీద పోలీసులు కేసు నమోదు చేశారని ఎస్పీ అమిత్ సంఘి తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఢిల్లీలోని ఓ youtuber గత మేలో తన పెంపుడు కుక్క మీద అమానవీయంగా ప్రవర్తించారు. పెంపుడు కుక్క మీద ఓ యూట్యూబర్ పైశాచికంగా ప్రవర్తించాడు. కుక్క మెడకు Hydrogen‌ balloons కట్టి వదిలేశాడు. ఆ బెలూన్లు పైకి వెళ్తుండగా.. కుక్క కూడా వాటితో పాటు గాల్లోకి వెళ్తుంటే అతడు పైశాచిక ఆనందం పొందాడు. 

24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: వాయు కాలుష్యంపై కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లకు సుప్రీం ఆదేశం

దీనికి సంబంధించిన ఫోటోలు ఫైనల్ గా మారాయి.  దీంతో అతడి తీరుమీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని మాలవ్యనగర్ కు చెందిన గౌరవ్ జాన్ ఓ యూట్యూబర్.  తన యూట్యూబ్ ఛానల్ లో వ్యూస్ కోసం ఇలా కుక్క మెడకు బెలూన్లు కట్టి వీడియోలు రూపొందించాడు. ఆ కుక్కకు డాలర్ అని పేరు పెట్టుకున్నాడు. దాని బర్త్ డే సందర్భంగా ఈ విధంగా చేశాడు. 

ఇంటి దగ్గరున్న పార్కు దగ్గర అతడు తన తల్లితో కలిసి హైడ్రోజన్ బెలూన్లు కట్టి ఎగరేస్తున్నారు. ఇంట్లో, బయట చాలా సార్లు కుక్కకు బెలూన్లు మొత్తం కట్టి గాలిలోకి వదిలారు. గాల్లోకి బెలూన్లతో పాటు కుక్క కూడా ఎగురు తుండడంతో అతడు, అతడి తల్లి, కొందరు యువతులు కేరింతలు వేస్తూ పైశాచిక ఆనందం పొందారు.

ఈ పిచ్చి చేష్టలను చూసిన కొందరు మాలవ్యనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గౌరవ్‌ జాన్‌తో పాటు అతడి తల్లిపై కూడా కేసు నమోదైంది. ఈ చర్యకు అతడు క్షమాపణలు చెప్పాడు. జంతు ప్రేమికులు, వ్యూయర్స్ కు క్షమాపణలు చెబుతూ వీడియో రూపొందించాడు. అయితే అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.

click me!