24 గంటల్లో చర్యలు తీసుకోవాలి: వాయు కాలుష్యంపై కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లకు సుప్రీం ఆదేశం

By narsimha lode  |  First Published Dec 2, 2021, 3:02 PM IST

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 24 గంటల్లో వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసకోవాలని ఆదేశించింది. 



న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పారిశ్రామిక, వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి 24 గంటల సమయాన్ని ఇస్లూ అల్టిమేటం జారీ చేసింది సుప్రీం కోర్టు.గత కొన్ని వారాలుగా చర్యలు తీసుకొంటున్నా వాయు కాలుష్యం తగ్గకపోగా కాలుష్యం పెరుగుతుందని Supreme Court అభిప్రాయపడింది.  సమయం మాత్రమే వృధా అవుతుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.  Delhi లో వాయు కాలుష్యంపై వరుసగా నాలుగో వారం సుప్రీంకోర్టు వాదనలు వింటుంది.Diwali  తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా క్షీణించింది. అయితే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకొన్నా కూడా సత్పలితాలు రాలేదు.  దీంతో  సుప్రీంకోర్టు ఇవాళ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.

పాఠశాలలను పున: ప్రారంభించంపై అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు మందలించింది. మూడు, నాలుగేళ్ల పిల్లలు స్కూల్స్ కు వెళ్తుంటే పెద్దలు ఇంటి నుండి పనిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ బోధన ఆఫ్షన్ తోనే పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి ఇచ్చినట్టుగా కేజ్రీవాల్ సర్కార్  సుప్రీంకోర్టుకు తెలిపింది. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తాము కఠిన చర్యలు తీసుకొంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా పది రోజుల సెలవుల అనంతరం సోమవారం నుండి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. 

Latest Videos

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్ మూసివేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నా ఏమీ జరగడం లేదని తాము భావిస్తున్నామని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  దేశ రాజధానిలో గాలి నాణ్యత బాగా క్షీణించింది.తత ఢిల్లీలో ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 312 గా నమోదైంది.సున్నా నుండి 50 మధ్య ఏక్యూఐ ఉంటే మంచిది, 51 నుండి 100 సంతృప్తికరమైంది, 101 నుండి 200 మధ్యస్తం, 201 నుండి 300 వరకు క్షీణించినట్టుగా చెబుతున్నారు. గాలి నాణ్యత దృష్ట్యా శారీరక శ్రమ సుదీర్ఘ శ్రమను నివారించేందుకు safar ఒక సలహాను జారీ చేసింది వాయు కాలుష్యం పెరగని కారణంగా ఢిల్లీలోని కొందరు శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.

click me!