తనను అడగకుండా భర్త పానీపూరీ తెచ్చాడని... విషం తాగి భార్య ఆత్మహత్య..

Published : Sep 01, 2021, 02:46 PM IST
తనను అడగకుండా భర్త పానీపూరీ తెచ్చాడని... విషం తాగి భార్య ఆత్మహత్య..

సారాంశం

అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

పూణే : మహారాష్ట్రలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశం.. భర్త తన మాట వినలేదన్న కోపం.. ఓ మహిళ చాలా చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకునేలా చేసింది. చిన్న చిన్న విషయాలకు కూడా ఈ మధ్య చాలామంది ఆత్మహత్యలకు పాల్పడి విలువైన జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 

అడగకుండానే పానీ పూరీని తీసుకువచ్చినందుకు భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే.. షోలాపూర్ కు చెందిన గహినీనాథ్ సర్వదే 2019లో ప్రతిక్ష అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణేలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు. 

కాగా వివాహమైనప్పటి నుంచి గహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు ప్రతీక్షకు కోపం వచ్చింది. 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మరుసటి రోజు ప్రతీక్ష విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతీక్ష తండ్రి ప్రకాష్, భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త గహినీనాథ్ మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇక ప‌ని అయిపోంది అనుకున్న స‌మ‌యంలో పీకే వండ‌ర్‌.. ప్ర‌శాంత్ కిశోర్ గెలుపు అస‌లు కార‌ణ‌లేంటి?
బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result