గర్ల్ ఫ్రెండ్ ని వెతికిపెట్టండి సర్.. ఎమ్మెల్యేకి యువకుడి లేఖ..!

Published : Sep 14, 2021, 09:23 AM IST
గర్ల్ ఫ్రెండ్ ని వెతికిపెట్టండి సర్.. ఎమ్మెల్యేకి యువకుడి లేఖ..!

సారాంశం

 భూషణ్ జామువంత్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థెతెకు... తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు

 ప్రజలు తమకున్న సమస్యను తీర్చాలంటూ.. ప్రజాప్రతినిధులకు కోరడం.. వారి కోసం లేఖలు రాయడం చాలా కామన్. తాజాగా.. ఓ యువకుడు కూడా కూడా తనకు ఉన్న సమస్యను తీర్చాలంటూ.. లేఖ రాయడం గమనార్హం. అయితే.. అతని సమస్యేంటో తెలుసా.. అతనికి గర్ల్ ఫ్రెండ్ దొరకడం లేదట. వెతికిపెట్టమంటూ లేఖ రాయడం ఇక్కడ విశేషం. ఈ సంఘటన  మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు ఒక యువకుడు రాసిన ఉత్తరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూషణ్ జామువంత్ అనే యువకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థెతెకు... తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు

తమ ప్రాంతంలో ఎందరో అమ్మాయిలు ఉన్నారని అయితే ఎవరూ తనను ఇష్టపడటం లేదని, దీంతో తనలో ఆందోళన పెరిగిపోయి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నదని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. మందుబాబులకు, అల్లరిచిల్లరగా తిరిగేవారికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారని, వారిని చూసినపుడు తన గుండె తరుక్కుపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉత్తరాన్ని చూసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు గతంలో ఇటువంటి లేఖలు ఎప్పుడూ రాలేదని, అయితే ఈ భూషణ్ జామువంత్ ఎక్కడ ఉంటాడనే విషయం తెలియలేదని, అందుకే అతని సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించానని అన్నారు. అతని ఆచూకీ తెలిస్తే, అతనికి కౌన్సెలింగ్ ఇప్పించగలుగుతానన్నారు. ఇలాంటి ఉత్తరాలు ఎమ్మెల్యేలకు రాయడం సరికాదన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌