రూ. 10 వేలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.. ఇంటిపైకి వచ్చి కాల్పులు.. ఇద్దరు మృతి

Published : Jun 18, 2023, 04:31 PM IST
రూ. 10 వేలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.. ఇంటిపైకి వచ్చి కాల్పులు.. ఇద్దరు మృతి

సారాంశం

ఢిల్లీలో రూ. 10 వేల తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఇద్దరు మరణించారు. ఆ వ్యక్తి పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో దారుణ ఘటన జరిగింది. రూ. 10 వేలు అప్పు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు టార్గెట్ చేసుకున్నారు. తుపాకి పట్టుకుని ఇంటికి వెళ్లారు. రాత్రిపూట తలుపు తట్టారు. అప్పు తీసుకున్న వ్యక్తి, ఆయన ఇద్దరు సోదరీమణులు బయటకు వచ్చారు. ఆ దుండుగులు వారి a,skముగ్గురిపై కాల్పులు జరపగా.. అప్పు తీసుకున్న వ్యక్తి తప్పా ఆయన ఇద్దరు సోదరీమణులు బుల్లెట్ గాయాలతో మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని ఆర్కే పురంలో చోటుచేసుకుంది.

నైరుతి ఢిల్లీలోని ఆర్కేపురంలో అంబేద్కర్ బస్తీ ఉన్నది. ఈ బస్తీకి చెందిన లలిత్ కొన్నాళ్ల క్రితం రూ. 10 వేల అప్పు చేశాడు. ఆ తర్వాత అప్పు చెల్లించాలని గట్టిగా అడగ్గా కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో ఎలాగైనా డబ్బులు రికవరీ చేసుకోవాలని ఇచ్చిన వారు అనుకున్నారు. 15 నుంచి 20 మంది పోగయ్యారు. లలిత్ ఇంటి పరిసరాల్లోనే ఉదయం 4 గంటల నుంచి కాపుకాశారు. 

మొదట తలుపు తట్టినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత రాళ్లు విసిరారు. అయినా.. వారు బయటకు రాలేదు. కాసేపయ్యాక ఇంటిలో నుంచి లలిత్, ఆయన ఇద్దరు సోదరీమణులు బయటకు వచ్చారు. లలిత్, ఆయన సోదరీమణులు 30 ఏళ్ల పింకీ, 29 ఏళ్ల జ్యోతి బయటకు రాగానే.. ఆ గుంపు తిరిగి ఇంటి ముందుకు వచ్చింది. 

Also Read: నడివీధిలో పరుగెత్తించి దారుణంగా చంపేసిన ముఠా.. తమిళనాడులో కలకలం (Video)

ఆ ఘటన గురించి వాగ్వాదం జరుగుతుండగా.. ఆ గుంపులో నుంచి ఒకరు గన్ తీసి ఆ ముగ్గరిపై కాల్చారు. వారిద్దరి మహిళలకు ఆ బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఒక బుల్లెట్ ఒకరి ఛాతి నుంచి చొచ్చుకువెళ్లగా మరో యువతికి పొట్టను చీల్చింది. ఇంకో బుల్లెట్ లలిత్ వైపూ దూసుకువచ్చింది. కానీ, లలిత్ తప్పింకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఉదయం 4.40 గంటల ప్రాంతంలో ఆర్కే పురం పోలీసు స్టేషన్‌కు తొలి ఫోన్ వెళ్లింది.

నైరుతి ఢిల్లీ డిప్యూటీ కమిషర్ మనోజ్ సీ మాట్లాడుతూ.. గాయపడ్డ పింకీ, జ్యోతిలను సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే వారిద్దరూ మరణించినట్టు తేలింది. ముగ్గురు నిందితులు అర్జున్, మైఖేల్, దేవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం