భార్యాపిల్లలపై గొడ్డలితో దాడి చేసిన వ్యక్తి.. మహిళ మృతి..

By SumaBala BukkaFirst Published Apr 28, 2023, 4:10 PM IST
Highlights

ఢిల్లీలో నిద్రిస్తున్న ఓ మహిళపై భర్త గొడ్డలితో దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. భార్యకు సపోర్ట్ చేశారని పిల్లలపై కూడా దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వారు ఆసుపత్రి పాలయ్యారు.

ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో గురువారం 50 ఏళ్ల మహిళను ఆమె భర్త గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 55 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ విజయ్ వీర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను కూడా చంపడానికి ప్రయత్నించాడు, దీతో వారిద్దరికీ మెడ మీద గాయాలయ్యాయి.

భార్యాభర్తలిద్దరూ తరచూ వరకట్నం విషయమై గొడవ పడుతుండేవారని, గురువారం విజయ్ వీర్ నిద్రలో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో కోణం ఏంటంటే.. విజయ్ వీర్ కు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.

Latest Videos

తన భార్యకు 28, 30 సంవత్సరాల వయస్సు గల వారి కొడుకు, కూతురు మద్దతు ఇవ్వడం కూడా విజయ్ వీర్ కి ఇష్టం లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయాన్ని గురువారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో లా గ్రాడ్యుయేట్ అయిన కూతురు తన తల్లిపై తన తండ్రి గొడ్డలితో దాడి చేశాడని చెప్పింది.

భార్యను చంపి, చేతులు, తల నరికి... శరీరానికి నిప్పంటించిన భర్త..

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, భార్య సుమన్ మెడపై పలుచోట్ల గాయాలతో... రక్తపు మడుగులో మంచంపై పడి ఉండగా, చేతికి గాయంతో విజయ్ వీర్ కనిపించారు. ఆమె కుమార్తె, కొడుకు కూడా మెడ, నుదిటిపై గాయాలున్నట్లు గుర్తించారు. తమ తండ్రి తమమీద, తల్లిమీద గొడ్డలితో దాడి చేశాడని పోలీసులకు తెలిపారు.

పోలీసులు నలుగురిని ఆసుపత్రికి తరలించగా, సుమన్ మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గర్ ముక్తేశ్వర్‌కు చెందిన విజయ్ వీర్‌ను సుమన్ 1992లో వివాహం చేసుకుంది. వీరిద్దరూ నెబ్ సరాయ్‌లోని నిందితుడి బంధువుల ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు.

పోలీసులు అతని పూర్వాపరాలను తనిఖీ చేసినప్పుడు, విజయ్ వీర్ 2017లో కూడా ఒకసారి అరెస్టు అయినట్లు కనిపెట్టారు. తన భార్యతో గొడవ పడి, కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపాడు. కుమారుడు శశాంక్‌ను గాయపరిచాడు. ఆ సమయంలో, అతను మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

కుటుంబం అభియోగాలు మోపడానికి నిరాకరించినందున అతన్ని విడుదల చేసి, విచారణను రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీర్‌పై హత్య, హత్యాయత్నం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

click me!