ప్రాణ స్నేహితుడిని కత్తితో బెదిరించాడు.. భయంతో బండరాయితో మోది చంపేశాడు..

Published : Mar 16, 2022, 01:41 PM IST
ప్రాణ స్నేహితుడిని కత్తితో బెదిరించాడు.. భయంతో బండరాయితో మోది చంపేశాడు..

సారాంశం

ఓ చిన్న గొడవ ప్రాణస్నేహితుల్ని బద్ధ శత్రువులుగా చేసింది. ఒకర్ని హంతకుడిగా, మరొకర్ని హతుడిగా మార్చింది. ఈ దారుణమైన ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

ఛత్తీస్ గఢ్ : వారిద్దరూ ప్రాణ స్నేహితులు… ఇద్దరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.  చిన్న చిన్న చిన్న చిన్న Jobలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న గొడవ వారి మధ్య చిచ్చు పెట్టింది. ఘర్షణ సమయం knife చూపించి మరో యువకుడిని చంపేస్తాను అని బెదిరించాడు. భయపడిన ఆ యువకుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి సమయంలో తిరిగి వెళ్ళి తనను చంపేస్తానంటూ బెదిరించిన యువకుడిని murder చేశాడు.

ఛత్తీస్ఘడ్లోని బిలాస్పూర్ లో నాను సారథి (19), సంజు సాహూ (18)  అనే ఇద్దరు యువకులు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేసుకుంటూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు ఉద్యోగాల నుంచి వచ్చిన తర్వాత కలిసి తిరిగేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం వీరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరు కొట్టుకున్నారు. ఆ సమయంలో నాను కత్తి తీసి సంజు ను బెదిరించాడు. చంపేస్తా అని హెచ్చరించాడు. దీంతో భయపడిన సంజు  పారిపోయాడు. అర్ధరాత్రి తిరిగి వెళ్లి ఓ పెద్ద బండరాయితో నాను తలపై మోది చంపేశాడు.

 ఆ తర్వాత సమీపంలోని ఓ గుడికి వెళ్లి అక్కడ పడుకున్నాడు. పక్కింటి వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు . గంట వ్యవధిలోనే సంజును పట్టుకుని విచారించారు. తనను కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరించాడని... అందుకే భయపడి అతడిని చంపేశారని చెప్పాడు. సంజును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు 

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే మార్చి 11న జరిగింది. ముగ్గురు మిత్రుల మధ్య cell phone చిచ్చు రేపింది.  క్షణికావేశంలో ఇద్దరు కలిసి మరో friendని murder చేశారు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గుంటపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం midnight జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణంలోని Gandhinagar కు చెందిన ప్రశాంత్ (16), అతని ఇద్దరు స్నేహితులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ప్రశాంత్ ఇటీవల ఒక cell phone ను తన మిత్రులకు ఇచ్చి అమ్మిపెట్టమని చెప్పాడు.

వారిద్దరూ ఓ దుకాణానికి వెళ్లగా.. దొంగతనం చేసి తీసుకువచ్చారా.. అని యజమాని ప్రశ్నించడంతో భయపడి వెనక్కి వచ్చేశారు. తర్వాత ప్రశాంతిని మిగతా ఇద్దరూ నిలదీశారు. తమను దొంగలుగా చిత్రీకరించేందుకు ఇలా చేశాడని అనుమానించి కక్ష పెంచుకున్నారు. బుధవారం సాయంత్రం ఇదే విషయంపై మాట్లాడదామని ఫోన్ చేసి ప్రశాంతిని పిలిపించారు. ముగ్గురూ కలిసి అంతారం తండాకు వెళ్లి కొద్దిసేపు గొడవ పడ్డారు. స్థానికులు గమనిస్తూ ఉండడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లి ఘర్షణపడ్డారు.
 
ప్రశాంత్ ని మిగతా ఇద్దరూ కలిసి కిందపడేసి బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే రోజు రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు జరిగిన విషయం చెప్పారు.  బాధితుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌