గర్ల్ ఫ్రెండ్ ను కలవాలంటే ఏ స్టిక్కర్ వాడాలి? తుంటరి ప్రశ్నకు పోలీసుల కౌంటర్..

Published : Apr 22, 2021, 04:55 PM IST
గర్ల్ ఫ్రెండ్ ను కలవాలంటే ఏ స్టిక్కర్ వాడాలి? తుంటరి ప్రశ్నకు పోలీసుల కౌంటర్..

సారాంశం

కరోనా మహహ్మారి నేపథ్యంలో అనేక రాష్ట్రాలు నిబంధనలు కఠిన తరం చేశాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలకు తెరలేపింది. 

కరోనా మహహ్మారి నేపథ్యంలో అనేక రాష్ట్రాలు నిబంధనలు కఠిన తరం చేశాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలకు తెరలేపింది. 

వాహనాల రాకపోకలను కట్టడి చేసే క్రమంలో ముంబై పోలీసులు కలర్ కోడ్ స్టిక్కర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది, తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సిన వారు తమ సౌలభ్యం కోసం ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ స్టిక్కర్లను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాల్సి ఉంటుంది. 

ఈ స్టిక్కర్ల వల్ల టోల్ ప్లాజాలు, చెక్ పాయింట్ల వద్ద వాహనదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోవచ్చు. ఇవి టోల్ ప్లాజాల వద్ద అందుబాటులో ఉంటాయి. వాహనదారులు వీటిని తమ ఇళ్లలోను తయారు చేసుకోవచ్చు. కాకపోతే వీటిని దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన శిక్షలు విధించాల్సి వస్తోందని పోలీసులు ముందే హెచ్చరించారు.

అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా ఓ తుంటరి నెటిజన్ పోలీసులకు ఓ కొంటె ప్రశ్న వేశాడు. ‘నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్దాం అనుకుంటున్నాను.. మరి వెహికిల్‌కు ఏ స్టిక్కర్ వాడాలి. ఆమెను చాలా మిస్ అవుతున్నా..’ అంటూ పోలీసులకు ఓ ప్రశ్న సంధించాడు.

దీనికి ముంబై పోలీసులు మాత్రం చాలా హుందాగా జవాబిచ్చారు. ‘గర్ల్ ఫ్రెండ్ కలవడం మీకు ఎంతో ముఖ్యమని మేము అర్థం చేసుకున్నాం. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది అంత అత్యవసరమేమీ కాదు. అయితే దూరం పెరిగే కొద్దీ మనసులు మరింత దగ్గరవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆరోగ్యకరం కూడా.. మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. గుర్తుంచుకోండి ఇది జీవితంలో ఓ దశ మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల ట్వీట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేల కొద్దీ లైకులు, రీ ట్వీట్లు వచ్చిపడుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌