
ముంబై : కోడళ్ల మీద అత్తామామలకు కోపం మామూలే. దీనివల్ల చిన్న చిన్న గొడవలు జరగడమూ మామూలే. అయితే మరీ పిచ్చి పీక్స్ కు వెళ్లిన ఓ మామ.. కోడలి మీద అతి దారుణచర్యకు పాల్పడ్డాడు. అదీ చాలా చాలా చిన్న విషయానికే కోడలిమీద దాష్టీకానికి పాల్పడ్డాడు. చాయ్ తో పాటు టిఫిన్ ఇవ్వలేదని ఏకంగా తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన థానేలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76)కు అతని కోడలు గురువారం ఉదయం టీ అందించింది. అయితు, టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలియదా? అంటూ రెచ్చిపోయిన ఆ పెద్ద మనిషి బాధితురాలి (42)పై విరుచుపడ్డాడు.
అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న తుపాకీ తీసుకుని ఆమె మీద కాల్పులు జరిపాడు. ఉదయం 11.30 గటల ప్రాంతంలో ఘటన జరిగింది. బాధితురాలి పొట్ట భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కళ్లముందే ఘోరం జరగడంతో నిశ్చేష్టులైన కుటుంబ సభ్యలు గాయాలపాలైన ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తోడి కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కాశీనాథ్ మీద కేసు నమోదు చేశామని థానే సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ ఘటేకర్ తెలిపారు. ఘటనకు మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో కరీంనగర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ మామ కోడలి మీద పగబట్టాడు. ఆమెను చెడుగా నిరూపించాలని కంకణం కట్టుకున్నాడు. Extramarital affair పెట్టుకుందని నిత్యం ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. అది సరికాదని Daughter-in-law ఎన్నిసార్లు చెప్పినా మానలేదు. మారలేదు. దీంతో కోడలు విసుగు చెందింది. దీనికి పరిష్కారం మామ చనిపోవడమే అని నిర్ణయించుకుంది.
తన అక్క కొడుకుతో కలిసి మామను అంతమొందించింది. నవంబర్ 27న కాచాపూర్ లో మాతంగి కనకయ్య (70) హత్యకు గురయ్యాడు. అయితే చంపింది కోడలేనని హుజూరాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తాజాగా తెలిపారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో మంగళవారం murder caseకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కనకయ్య భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందారు. కనకయ్యకు వయసు మీద పడిందే కానీ.. అనుమానం పిశాచం వదలలేదు. నిత్యం మద్యం సేవించేవాడు. ఆ తరువాత కోడలు కొంరమ్మకు మరో వ్యక్తితో Illegal relationship ఉందని అనుమానించేవాడు. అంతేకాదు తనకు తిండి పెట్టడం లేదని తిడుతూ శాపనార్థాలు పెట్టేవాడు. ఇదే విషయంలో ఈ నెల 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పదే పదే ఇలాగే వేధిస్తుండడంతో కొంరమ్మ విసుగు చెందింది.
ముసలోడు బతికి ఉంటే ఎప్పుడూ ఇలాగే తనను Suspicionతో వేధిస్తాడని, ఆస్తి కూడా తనకు దక్కదని భావించింది. తన అక్క కొడుకు, మానకొండూర్ మండలం కల్లెడకు చెందిన ప్రవీణ్ లో కలిసి కనకయ్యను చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం రోజూలాగే తాగి వచ్చి కోడలితో గొడవపడి.. నిద్రిస్తున్న కనకయ్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి, గొంతుకు తాడు బిగించి, బలంగా లాగడంతో మృతి చెందాడు.