ఈ నెల 28న పెగాసెస్‌పై భేటీ: సమావేశం కానున్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ

By narsimha lodeFirst Published Jul 22, 2021, 9:36 AM IST
Highlights

దేశాన్ని కుదిపేస్తున్న పెగాసెస్ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నెల 28వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నట్టుగా శశిథరూర్  ప్రకటించారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్న పెగాసెస్  అంశంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది.ఈ నెల 28వ తేదీన ఈ అంశంపై చర్చించాలని  ఐటీ, కమ్యూనికేషన్లపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్ఠాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకొంది.పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన  రెండు రోజుల్లో ఇదే అంశంపై ఉభయ సభల్లో  గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.   పెగసాస్ విషయమై ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై  చోటు చేసుకొన్న  పార్లమెంటరీ స్ఠాండింగ్ ఈ నెల 28న సమావేశం కానున్నట్టుగా లోక్‌సభ వెబ్‌సైట్ అప్‌లోడ్ చేసింది. 

ఈ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నాడు. ఈ కమిటీలో  కార్తీ చిదంబరం,తేజస్వీ సూర్య,  సుమలత అంబరీష్, సన్నీడియోల్,  రాజ్యవర్ధన్ రాథోడ్,  మహుమోత్రాతో పాటు అనిల్ అగర్వాల్,  సుభఆష్ చంద్ర,  శక్తిష్ గోహిల్  తదితరులున్నారు. దేశంలోని సుమారు వెయ్యి మంది ఫోన్ నెంబర్లు హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవాళ ఈ విషయమై రాజ్యసభలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి  ప్రకటన చేసే అవకాశం ఉంది.

click me!