‘‘ఓటర్ జాబితాలో పేరు ఉండలా చూసుకోండి.. లేదంటే.. నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు’’

By Rajesh KarampooriFirst Published Nov 23, 2022, 9:05 PM IST
Highlights

ఎన్సార్సీపై మమతా బెనర్జీ: ఎన్సార్సీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఓటర్ జాబితాతో పేరు ఉండలా చూసుకోండి.. లేదంటే, ఎన్సార్సీ పేరులో నిర్బంధ శిబిరాలకు తరలిస్తారని కేంద్రంపై విరుచుక పడ్డారు.

ఎన్సార్సీపై మమతా బెనర్జీ: జాతీయ పౌర పట్టిక(ఎన్సార్సీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ..కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్‌ఆర్‌సి అమలు ముసుగులో నిర్బంధ శిబిరాలకు వెళ్లకుండా ఉండేందుకు ఓటరు జాబితాలో మీ పేరు ఉండేలా చూసుకోవాలని బుధవారం మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని నిరుపేదలకు భూమి పట్టాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 4,701 భూమి పట్టాలను ఆమె అందజేశారు. ఓటరు జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని, లేకుంటే ఎన్‌ఆర్‌సీ పేరుతో నిర్బంధ శిబిరానికి పంపిస్తామని మమతా బెనర్జీ అన్నారు.  

కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు

ఉపాధి హామీ పధకం (MNREGA) డబ్బును కేంద్రం చెల్లించడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ పేరు చెప్పకుండా.. ఆ పార్టీ ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైల్వే, ఎయిర్‌పోర్టు అధికారులు బలవంతంగా భూమిని స్వాధీనం చేస్తున్నాయని మమతా బెనర్జీ అన్నారు. సరైన పరిహారం, పునరావాసం లేకుండా బెంగాల్‌లో ఇటువంటి చర్యలను అనుమతించబోమని సీఎం చెప్పారు. మీ భూమిని బలవంతంగా లాక్కుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని, ఆందోళనకు దిగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
అస్సాం-మేఘాలయ హింసాకాండపై విచారం 

బుధవారం అస్సాం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసాకాండపై సీఎం మమతా బెనర్జీ  విచారం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మేఘాలయలోని ముక్రోహ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన పట్ల తాను చాలా బాధపడ్డాననీ, ఈ పోరాటంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనలో అస్సాంకు చెందిన ఫారెస్ట్‌ గార్డు, మేఘాలయకు చెందిన ఐదుగురు మృతి చెందారు.

click me!