మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ 'కేసరియా', 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాటలకు స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. ఈ యాత్ర నేడు(నవంబర్ 23) మధ్యప్రదేశ్ లో అడుగుపెట్టింది. అయితే.. రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో మంగళవారం యాత్రకు బ్రేక్ పడింది. ఈ విరామ సమయంలో మాజీ ఎంపీ సీఎం దిగ్విజయ్ సింగ్ చాలా హుషారుగా కనిపించారు. తన తోటి కార్యకర్తలు, సహచరులతో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశారు. కాంగ్రెస్ క్యాంపులో పుల్ జోష్ నింపాడు. ప్రస్తుతం అతని డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్లే.. భారత్ జోడో యాత్రలో మంగళవారం విరామం వచ్చింది. ఆ విరామ సమయాన్ని దిగ్విజయ్ సింగ్ తన తోటి సహచరులతో కలిసి సరదగా గడిపారు. తొలుత తన స్నేహితులతో క్రికెట్ ఆడారు.ఆ తర్వాత.. తన సహచరులతో కలిసి దిగ్విజయ్ సింగ్ స్టెప్పులేసి.. డ్యాన్స్ ఫ్లోర్‌లో తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Some happy, singing & dancing faces from the as the Yatris took a two day break to rejuvenate before entering Madhya Pradesh! ji is all ❤️ pic.twitter.com/pjwtbzorqj
— Gaurav Pandhi (@GauravPandhi)
undefined
44 సెకన్ల వైరల్ వీడియోలో.. అతను మొదట కేసరియా తేరా ఇష్క్ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. దీని తర్వాత అతను యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటలో డ్యాన్స్ చేస్తున్నాడు. దిగ్విజయ్ సింగ్ డ్యాన్స్ ఫ్లోర్‌లో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. దూరంగా నిలబడిన కొంత మంది సహచరులను లాగి మరి వారితో స్టెప్పులేశాడు. ఇలా దిగ్విజయ్ సింగ్‌తో పాటు భారత్ జోడో యాత్రలోని ప్రయాణికులు కూడా పూర్తి ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ వృద్ధాప్యంలో కూడా పూర్తిగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు.
అని బీజేపీ దుయ్యబట్టింది
అదే సమయంలో దిగ్విజయ్ సింగ్ వైరల్ వీడియోపై బీజేపీ మండిపడింది. ఉద్వేగంతో నిండిన నృత్యం, ముఖంలో ఆనందం వెల్లివిరిసింది... మీ పదునైన నడక ఇలాగే ఉండనివ్వండి డిగ్గీ రాజా అని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. దీంతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా దీనిపై విరుచుకుపడ్డారు.
భారత్ జోడో యాత్ర నవంబర్ 23న మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో సాగుతోంది.150 రోజుల వ్యవధిలో 3,570 కిలోమీటర్ల మేర కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారీ ర్యాలీతో పార్టీ కార్యకర్తలను మరియు సాధారణ ప్రజలను సమీకరించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల నుండి వరుస పోల్ పరాజయాలను చవిచూసిన తరువాత ఎన్నికలలో విజయం సాధించి.. అధికారంలోకి తిరిగి రావాలని భావిస్తోంది.