మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా: మమత బెనర్జీ ప్రమాణం

By narsimha lodeFirst Published May 5, 2021, 10:51 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ బుధవారం నాడు ప్రమాణం చేశారు.

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ బుధవారం నాడు ప్రమాణం చేశారు.బెంగాల్ రాష్ట్రానికి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఆమె ఇవాళ ప్రమాణం చేశారు. రాష్ట్రంలో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలకంగా వ్యవహరించారు మమత. లెఫ్ట్‌ఫ్రంట్  అధికారాన్ని కోల్పోయిన తర్వాత మమత బెనర్జీ వరుసగా జరిగిన మూడు ఎన్నికల్లో  విజయం సాధించింది.  తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు  బీజేపీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేసింది.  అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా  బీజేపీ ఓట్లను, సీట్లను పెంచుకొంది. కానీ అధికారానికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. 

also read:నందిగ్రామ్‌లో రీకౌంటింగ్‌కి మమత డిమాండ్

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  అతి కొద్ది మందిని మాత్రమే ఆమె ఆహ్వానించారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన  మాజీ సీఎం బద్దదేవ్ భట్టాచార్య, లెఫ్ట్ ఫ్రంట్ నేతలకు ఆమె ఆహ్వానాలు పంపారు. 67 మంది అతిథులకు మాత్రమే మమత ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపారు. 1970 దశకంలో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1976-80 రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మన్మోహాన్ సింగ్ కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయ్ కేబినెట్ లో కూడ ఆమె పనిచేశారు. 2011 మే 20 నుండి బెంగాల్ సీఎంగా ఆమె కొనసాగుతున్నారు. 

click me!