Mamata Banerjee: ముర్మూకే విజయావకాశాలు ఎక్కువ.. బీజేపీ అడిగే.. మ‌ద్ద‌తు.. : దీదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published Jul 2, 2022, 5:54 AM IST
Highlights

Mamata Banerjee: రాష్ట్రపతి ఎన్నికలపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ద్రౌపది ముర్మూకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బీజేపీ అడిగి ఉంటే.. ఆమెకే విపక్షాలు కూడా మద్దతు ఇచ్చి ఉండేవని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
 

Mamata Banerjee: రాష్ట్రపతి ఎన్నికలపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల  మహారాష్ట్రలో జ‌రిగిన‌ పరిణామాల‌ను చూస్తుంటే..  జూలై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం అన్నారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన కీల‌క‌ మార్పు గురించి బెనర్జీ ప్రస్తావించారు.  MVA ప్రభుత్వం అధికారం నుండి నిష్క్రమించడానికి దారితీసింది, ఎవ‌రూ ఊహించని విధంగా.. ఏకనాథ్ షిండే నూత‌న‌ ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిప్యూటీగా నియమించారని తెలిపారు.

అభ్యర్థిని ప్రకటించడానికి ముందు బీజేపీ త‌మ‌తో చర్చించి ఉంటే.. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ద్రౌపదికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలించే వాళ్లమ‌నీ,  అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎంచుకోవడమే దేశానికి మంచిదని అన్నారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఇచ్చే ముందు వారితో ఏమీ చర్చించకపోవడం NDA తప్పు అని బెనర్జీ అన్నారు.

మహారాష్ట్రలోజ‌రిగిన మార్పును పరిశీలిస్తే..  ఎన్డీఏ అధ్యక్ష అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని బెనర్జీ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని, అన్ని మతాలు, కులాలు, వర్గాల వారిని గౌరవిస్తున్నామని ఆమె అన్నారు.

ఈ పరిస్థితిలో తాను ప్రతిపక్ష పార్టీలతో కట్టుబడి ఉంటానని బెనర్జీ చెప్పారు. వారి నిర్ణయం సమిష్టిగా తీసుకున్నట్లు కూడా చెప్పారు. 17- 18 రాజకీయ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయనీ, ఆ నిర్ణ‌యం కేవ‌లం త‌న‌ది మాత్రమే కాదనీ, అన్ని ప్రతిపక్షాలు నిర్ణ‌యమ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో.. ఆ నిర్ణ‌యాన్ని అంగీక‌రిస్తానని అన్నారు.

దీదీపై కాంగ్రెస్ ఫైర్ ​ 

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్​ తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆమె మోదీతో రహస్య ఒప్పందం చేసుకుంద‌నీ, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంద‌ని, ఆమె అసలు రంగు బయట ప‌డింద‌ని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి  అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని మమతనే ఎంపిక చేశారనీ, అందుకు ప్ర‌తిప‌క్షాలు అంద‌రూ మద్దతు ఇచ్చామ‌నీ, కానీ.. ఇప్పుడూ..ఆమె బీజేపీ  ఏజెంట్​లా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత అన్నారు. గెలిచేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉందని నిర్ధరించుకున్నాకే భాజపా.. ద్రౌపది ముర్మూను అభ్యర్థిగా చేసుకుని ఎన్నికల బరిలో దిగింది. ద్రౌపది గెలుస్తారనడం.. ఏదో కొత్తగా కనుగొన్న విషయం కాదని అన్నారు.

click me!